breaking news
Authoritarian rule
-
ట్రంప్ రాజు కాదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జనం తిరుగుబాటు ప్రారంభించారు. ‘నో కింగ్స్’ పేరిట శనివారం దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ట్రంప్ రాజు కాదని, ఇక్కడ రాజులెవరూ లేరని, నిరంకుశ పరిపాలన ఆపాలని పెద్ద ఎత్తున నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దేశాన్ని నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. నియంతృత్వ పరిపాలనను ప్రతిఘటించడం, నిరసన తెలపడమే అసలైన దేశభక్తి అని ప్రజలు తేల్చిచెప్పారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్తోపాటు బోస్టన్, అట్లాంటా, షికాగో తదితర నగరాల్లో నిరసనకారులు కదం తొక్కారు. వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్ సహా వివిధ నగరాల్లో వేలాది ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. గాలితో నింపిన దుస్తుల్లాంటివి ధరించారు. అమెరికా రాజ్యాంగ ప్రవేశికను ముద్రించిన బ్యానర్లపై సంతకాలు చేశారు. తాము ముమ్మాటికీ అసలైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు. నియంతగా మారుతున్న ట్రంప్ నిరసన ప్రదర్శనలపై అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అవన్నీ ‘అమెరికాను ద్వేషించే’ ర్యాలీలు అంటూ ఆరోపించింది. ట్రంప్ మద్దతుదారులు సైతం ఈ ర్యాలీలను తప్పుపట్టారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా జనం సామూహికంగా నిరసన తెలపడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కొన్నిరోజుల క్రితం అమెరికాలో షట్టౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సేవలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రంప్ నిర్వాకం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని వారు మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుపట్టారు. నిరంకుశ అధికారం చెల్లబోదని తేల్చిచెప్పారు. ట్రంప్ విధానాలు తమకు ఎంతమాత్రం నచ్చడం లేదని ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికురాలు షాన్ హోవార్డ్ చెప్పారు. తాను గతంలో ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ముందుకెళ్తోందని, వలసదారులను అక్రమంగా నిర్బంధించడం ఏమిటని మండిపడ్డారు. ప్రధాన నగరాల్లో సైన్యాన్ని మోహరించడం సరైంది కాదన్నారు. ఇదంతా ‘అన్–అమెరికన్’ అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తమ అధ్యక్షుడు ట్రంప్ నియంతగా మారిపోతున్నారని మరో నిరసనకారుడు ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా, నిరసన కార్యక్రమాల విషయంలో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలియజేశారు. జెట్ విమానంలో ‘కింగ్ ట్రంప్’ తనకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. ‘నో కింగ్స్’ నినాదాన్ని హేళన చేస్తూ కింగ్ ట్రంప్ పేరిట ఒక కృత్రిమ మేధ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో కిరీటం ధరించిన ట్రంప్ జెట్ విమానంలో కూర్చొని దూసుకెళ్తున్నారు. బాంబుల తరహాలో ఈ విమానం బురదను చిమ్ముతోంది. ఆ బురదంతా అమెరికాలో నగరాల్లోని నిరసనకారులను కమ్మేస్తోంది. ట్రంప్ తనను తాను బలమైన రాజుగా పరోక్షంగా ప్రకటించుకున్నారు. నిరసన ర్యాలీలను లెక్కచేయబోనని, బురదతో సన్మానిస్తానని సంకేతాలు పంపించారు. -
సిరియా ఆపద్ధర్మ ప్రధానిగా బషీర్
డమాస్కస్: అసద్ నిరంకుశ పాలనకు తెరదించిన హయత్ తహ్రీర్ అల్ షామ్, ఇతర తిరుగుబాటుదారుల గ్రూప్‌లు ఆపద్ధర్మ ప్రధానిగా మొహమ్మద్ అల్ బషీర్‌ను నియమించారు. 2025 మార్చి ఒకటో తేదీదాకా ఈయన తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగుతారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. సిరియాలో శాంతిభద్రతలు నెలకొనడానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వంలో సభ్యులతో కలిసి మంగళవారం డమాస్కస్‌లో సమావేశం నిర్వహించిన ఆయన... తిరుగుబాటు అనంతరం శాఖలు, సంస్థల బదిలీలపై చర్చించారు. రాబోయే రెండు నెలలు సిరియా ప్రజలకు సేవలందించడానికి, సంస్థలను పునఃప్రారంభించడానికి సమావేశాలు నిర్వహించామని బషీర్ వెల్లడించారు. మైనారిటీలను గౌరవిస్తూ ప్రజాస్వామిక రీతిలో నడిచినంత కాలం సిరియా ప్రభుత్వానికి అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని ఆదేశ విదేశాంగ మంత్రి చెప్పారు. -
బాబు నిప్పు కాదు.. తుప్పు
సీఎం నియంతృత్వ పాలనపై గుంటూరు నుంచి ప్రచారోద్యమం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మందిరాలు, మసీదులు కూల్చివేత దారుణం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టీకరణ విజయవాడ బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ తాను నిప్పులా బతుకుతున్నట్టు చెబుతుంటారని, రాజకీయ విలువలను దిగజారుస్తున్న ఆయన చేష్టల్ని చూస్తుంటే నిప్పు కాదు తుప్పు అని నిరూపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను మారానని, మరో అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానని నమ్మించిన చంద్రబాబు ఇప్పుడు నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యాండెట్‌తో గెలిచిన ఎమ్మెల్యేలను అనేక ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తున్న చంద్రబాబు రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్న చంద్రబాబు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. సీఎం నియంతృత్వ పోకడలను ఎండగట్టేలా త్వరలో గుంటూరు జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారోద్యమం చేపడతామని వెల్లడించారు. రాజకీయ ప్రక్షాళన కోసం చేపట్టే ఈ ప్రచార జాతాలో వామపక్ష పార్టీలతోపాటు లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూడా పాల్గొంటారని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా... విజయవాడ నగరంలో రోడ్ల వెడల్పు పేరుతో అర్ధరాత్రి గుళ్లు, మసీదులు కూల్చడం టీడీపీ ప్రభుత్వ నిరంకుశ పోకడలకు నిదర్శనమన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవలు ఎవరైనప్పటికీ సెక్యులర్ స్టేట్‌లో వారి మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. దేవాలయ భూములు హిందూవులు మాత్రమే సాగు చేయాలనే 425 జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నగరి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేసి గాయపరచడం దారుణమన్నారు. చంద్రబాబు వత్తాసుతో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు ప్రతిపక్ష పార్టీలపై దాడులకు తెగబడడంతోపాటు జన్మభూమి కమిటీల పేరుతో బ్రోకర్లుగా డబ్బులు గుంజుతున్నారని ఆరోపించారు. ఈ నెల 6 నుంచి ప్రభుత్వం చేపట్టనున్న ప్రజా సాధికార సర్వేలో సేకరించిన వివరాలను ఆయా కుటుంబ పెద్దలకు ఒక కాపీ ఇవ్వాలని, తప్పులు దొర్లితే సరిదిద్దే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన, విద్యుత్ ఉద్యోగుల సమస్యను ఇద్దరు సీఎంలు కూర్చుని పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రామకృష్ణ సూచించారు. పార్టీ నేతలు పుట్టా హరనాథ్‌రెడ్డి, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు. -
ఇది ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా?
కొత్తపేట : రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనో లేక నియంతృత్వ పాలన సాగుతుందో అర్ధం కావడం లేదని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. సీఎం చంద్రబాబు వైఖరిపై ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తాను ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా, తన చేతిలో ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై జగ్గిరెడ్డి నిరసన తెలిపారు. గురువారం కొత్తపేటలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న వారితో పరిపాలన సాగించాలన్నది రాజ్యాంగ సారాంశమని చెప్పారు. రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి అపహాస్యం నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎమ్మెల్యే అయిన తనకు మంజూరు చేయకుండా, తన చేతిలో ఓడిన వారికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని విమర్శించారు. ఇది ప్రజా తీర్పుకు విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు కాదని, ఓడిన వారికి ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులిస్తే.. అభివృద్ధి జరిగి ఎక్కడ తమకు మంచి పేరు వస్తుందోనని భయపడుతున్నారని చెప్పారు. నిధులు ఇవ్వనంత మాత్రాన ప్రజా తీర్పు మారదన్నారు. తమను ఇబ్బంది పెడితే, ప్రతిపక్షంలోనే ఉంటూ ప్రజల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలపై ఆందోళనతో పాటు న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సభ్యులు సాకా ప్రసన్నకుమార్, మద్దూరి సుబ్బలక్ష్మి, పార్టీ మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, కనుమూరి శ్రీనివాసరాజు, తమ్మన శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబుది నియంతృత్వ పాలన'