breaking news
archana kochar
-
సృజనార్చన
అర్చన కొచ్చర్.. బాలీవుడ్లో షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, మలైకా అరోరా, కంగనా రనౌత్, డయానా పెంటీ మొదలైన వారికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా చేసి సెలబ్రిటీ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలలో ఫ్యాషన్, టాలెంట్ సెగ్మెంట్స్ కోసం అవుట్‌ఫిట్స్‌ని డిజైన్ చేసి తెలంగాణ టెక్స్టైల్స్, చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఈ నేపథ్యంలో అర్చన పరిచయం ఆమె మాటల్లోనే.‘నేను పుట్టి, పెరిగింది ముంబైలో. కామర్స్‌లో డిగ్రీ చేశాను. ఫ్యాషన్‌కు సంబంధించిన అకడమిక్ డిగ్రీ ఏమీ లేదు కానీ.. ఫ్యాషన్ పట్ల ప్యాషన్ నాకు ఊహ తెలిసిన నాటి నుంచే మొదలైందని చె పొ్పచ్చు. దీనికి స్ఫూర్తి చిన్నప్పటి నుంచి నేను చూసిన చేనేత, ఎంబ్రాయిడరీ కళాకారులే! ఏళ్ల నాటి ఈ కళా సంస్కృతిని ప్రతి తరానికి పరిచయం చేస్తూ వాటిని ప్రిజర్వ్ చేస్తున్న తీరు నన్ను అబ్బురపరచేది. ఆ కళల పట్ల వాళ్లకున్న నిబద్ధత, నైపుణ్యం, సృజనాత్మకతకు ముచ్చటేసేది. వీటన్నిటికీ ఓ వేదిక ఏర్పర్చి.. ప్రపంచమంతా గుర్తించేలా చేయాలనిపించింది.ప్రతి నేత వెనుక ఉన్న చారిత్రక కథనాన్ని ప్రపంచానికి వినిపించాలనిపించింది. ఆ ప్రేరణతోనే ఫ్యాషన్ డిజైనింగ్లోకి అడుగుపెట్టాను. పదహారవ ఏటనే ఫస్ట్ ఎగ్జిబిషన్‌ను పెట్టాను. ఇరవయ్యేళ్ళకే బ్రైడల్ వేర్ డిజైనర్‌గా పాపులర్ అయ్యాను. అయితే నా ఈ జర్నీకి మా అమ్మనూ ఓ స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల నాకున్న ఆసక్తిని గమనించి దాని వివరాల్లోకి వెళ్లేలా ప్రోత్సహించింది. ఈ రోజు నేనీ స్థాయిలో ఉండటానికి మా అమ్మతో పాటు మా వారు రాజీవ్ కొచ్చర్, మా అమ్మాయి సిమ్రాన్ కారణం. వాళ్ల ప్రోత్సాహ సహకారాలు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అహింసా సిల్క్పట్టు అనగానే ఆ నేతకు ఎన్ని పట్టుపురుగులను పొట్టన పెట్టుకున్నారో అనే ఆలోచన, అభిప్రాయానికి వచ్చేస్తారు ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే ఎవ్వరైనా! అందులో నేను కూడా! అందుకే ఒక ఫ్యాషన్ డిజైనర్‌గా పర్యావరణహితమైన ఫ్యాషన్‌ను, డిజైన్స్‌ను క్రియేట్ చేసి, ప్రమోట్ చేయాలని నిశ్చయించుకున్నాను. ఆప్రాజెక్ట్కి ‘అహింసా సిల్క్’ అనే పేరు పెట్టాను. జార్ఖండ్ వెళ్లి.. అక్కడి గిరిజన స్త్రీలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఈప్రాజెక్ట్ వల్ల ఆ గిరిజన మహిళలకు ఉ పాధి దొరకడమే కాదు వాళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది, వాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రమూ వచ్చింది. ఈ అహింసా సిల్క్ డిజైన్స్‌తో న్యూయార్క్ ఫ్యాషన్ షోలో పాల్గొన్నాను. అంతర్జాతీయ గుర్తింపు దొరికింది.మిస్ వరల్డ్ బ్యూటీ ప్యాజెంట్లో..ఫ్యాషన్ ప్రపంచంలో నా ప్రయాణం చిన్నగానే మొదలైంది. కానీ ప్రతిచోటా మన దేశ ప్రతిభను చాటడానికే ప్రయత్నించాను. ‘అహింసా సిల్క్’ ప్రాజెక్ట్‌తో మన దేశానికున్న రిచ్ టెక్స్టైల్ హెరిటేజ్ ని ప్రపంచానికి పరిచయం చేశాను. ప్రతి కలెక్షన్ వెనుక భారతీయ చేనేత కళానైపుణ్యం, సంస్కృతిని చూపించాను. అందుకే ఈ రోజు నాకు మిస్ వరల్డ్ (Miss World) బ్యూటీ పాజెంట్‌లో అవుట్‌ఫిట్స్‌ని డిజైన్ చేసే అవకాశం దక్కింది. ఇది నా ఘనత కాదు.. మన చేనేత సంస్కృతికున్న స్ట్రెంత్. పోచంపల్లి ఇక్కత్, గొల్లభామ, నారాయణ్‌పేట్ చీరలు, లగ్జరియస్ బ్రోకేడ్స్, బంగారు జరీ చీరలు, జర్దోసీ ఎంబ్రాయిడరీ, హైదరాబాద్ ముత్యాలతో 240 అవుట్‌ఫిట్స్‌ను డిజైన్ చేశాం. ప్రతి త్రెడ్‌లో డీటైయిలింగ్ కనపడుతుంది. అది మన కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతకు అద్దం పడుతుంది. ఈ డిజైన్స్‌ను ధరిస్తున్న ప్రతిఒక్క పార్టిసిపెంట్‌కి ఈ దేశ ఘన చరిత్రను ధరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలా ఈ డిజైన్స్ అన్నీ మన కల్చర్, ప్రైడ్, గ్లోబల్ సిస్టర్హుడ్కి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇవి పార్టిసిపెంట్స్ అంటున్న మాటలు! ఈ మొత్తం అవుట్‌ఫిట్స్‌ని డిజైన్ చేయడానికి నాకు, నా టీమ్‌కి నెల రోజులు పట్టింది. వీటిని టాప్ మోడల్ రౌండ్, ఫినాలేలో ధరిస్తారు.దక్షిణ భారత ఫ్యాషన్ కాపిటల్‌గా.. పోచంపల్లి ఇక్కత్ నుంచి గద్వాల దాకా తెలంగాణకు ఘనమైన చేనేత చరిత్ర ఉంది. ఇక్కడ సంప్రదాయ నేతకు ఎంతప్రాధాన్యం ఉందో ఫ్యాషన్‌కూ అంతేప్రాముఖ్యత కనిపిస్తుంది. తమ మూలాలను ఎంత గౌరవిస్తారో ట్రెండ్స్‌నూ అంతే ఆదరిస్తారు. ఇక్కడ హెరిటేజ్‌కి, మోడర్న్ స్టయిల్‌కి మధ్య స్ట్రాంగ్ కనెక్షన్ కనిపిస్తుంది. అందుకే ఈప్రాంతం నాకు కల్చర్ అండ్ ఫ్యాషన్ల ఫ్యూజన్‌గా కనిపిస్తుంది. ఫ్యాషన్ అందంగా.. సస్టెయినబుల్‌గా ఇవాల్వ్ అవడానికి ఈ బ్యాలెన్స్ చాలా ముఖ్యం.తెలంగాణ టెక్స్టైల్స్, చేనేత కళను కంటెంపరరీ ఫ్యాషన్‌గా మలచడానికి దీనికి మించి ఇంకేం కావాలి! అంతేకాదు హైదరాబాద్‌లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంస్కృతిక సంపద, సృజన ఇవన్నీ దీన్ని సౌత్ ఇండియా ఫ్యాషన్ హబ్‌గా మారే స్కోప్నిస్తున్నాయి. ఈ బ్యూటీ పాజెంట్ సక్సెస్‌తో ఫ్యాషన్ షోస్‌కు తెలంగాణ మంచి హోస్ట్‌గా ఉండగలదని నిరూపించుకుంది. విరివిగా ఫ్యాషన్ షోలు జరిగితే స్థానిక ఫ్యాషన్ డిజైనర్స్, చేనేత కళాకారులకూ మంచి సపోర్ట్ దొరుకుతుంది’ అని చెప్పారు అర్చన.– రమ సరస్వతిఫొటోలు: ఎస్ ఎస్ ఠాకూర్ -
సన్నీలియోన్‌కు మరో ఘనత!!
బాలీవుడ్ బాంబ్‌షెల్ సన్నీలియోన్ మరో అరుదైన ఘనతను సాధించబోతోంది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ మీద నడవబోతున్న మొట్టమొదటి బాలీవుడ్ నటిగా ఆమె గుర్తింపు పొందబోతోంది. ఈ విషయాన్ని సన్నీ లియోన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంత పెద్ద ఈవెంట్లో పాల్గొనే అవకాశం తనకు దక్కినందుకు ఆమె ఉబ్బి తబ్బిబ్బు అయిపోతోంది. ప్రముఖ డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించిన వస్త్రాలను ధరించి ర్యాంప్ మీద ఓపెనింగ్ షోలో తాను నడవబోతున్నట్లు సన్నీ ట్వీట్ చేసింది. ఇక ఇదే విషయం గురించి డిజైనర్ అర్చనా కొచ్చర్ కూడా ట్వీట్ చేసింది. తాను భారతదేశంలో పర్యటించినప్పుడు పొందిన అనుభూతులతో రూపొందించిన 'ఎ టేల్ ఆఫ్ టూ ట్రావెల్స్' అనే డిజైనర్ దుస్తులను సన్నీ కోసం అర్చన ఇస్తున్నారు. Woohoo!! Dreams really do come true! Thank you @Archana_Kochhar pic.twitter.com/5M9ACJdRXI — Sunny Leone (@SunnyLeone) 4 September 2016 So excited!A dream come true...I'm walking NewYork Fashion Week SS17 for Archana Kochhar Opening Show on the 8th Sep 2016 @Archana_Kochhar — Sunny Leone (@SunnyLeone) 4 September 2016 The count down begins ! 8th September #NYFW16 #ArchanaKochhar #NYFW #FTLMODA #couture #fashionshow pic.twitter.com/jJ6EewhXpp — Archana Kochhar (@Archana_Kochhar) 1 September 2016