breaking news
anurag engineering college
-
మార్చి 4 నుంచి ‘అనురాగ్’ సెట్
సాక్షి, హైదరాబాద్: అనురాగ్ యూనివర్సిటీ మార్చి 4 నుంచి 6 వరకు ‘అనురాగ్ సెట్–2022’ను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వెల్లడించారు ఈ సెట్ ద్వారా తమ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహించే సెట్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్నారు. ఈ పరీక్ష ఫలితాలను మార్చి 26న వెల్లడిస్తామని, మే 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో నీలిమ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సెట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో వర్సిటీ చాన్స్‌లర్ దేశాయ్, వైఎస్ చాన్స్‌లర్ రామచంద్ర, రిజిస్టార్ సైదా సమీన్ ఫాతిమా, యూనివర్సిటీ నిర్వాహకులు అనురాగ్ పాల్గొన్నారు. -
కళాశాల భవనం పైనుంచి పడి బీటెక్ విద్యార్థి మృతి
ఘట్కేసర్: ఇంజినీరింగ్ కళాశాలపై నుంచి పడి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్లోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. కళాశాలలో రెండో సంవత్సరం(మెకానికల్) చదువుతున్న దినేష్(19) భవనం పై నుంచి పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు పడ్డాడా అనే కోణంలో దృష్టి సారించారు. దినేష్ నగరంలోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.