breaking news
Aerobic Exercise sizes
-
బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మీకోసమే ఇది
ఇటీవల కొంతమంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా శరీరంలోని క్యాలరీస్‌ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రీతింగ్ వ్యాయామాలు మంచివే అయినా... బరువు తగ్గించడానికి మాత్రం ఇది సరికాదు. దానివల్ల మన శరీరంలోకి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్లడం వల్ల కొంత ఉపయోగం ఉండవచ్చు గాని... బరువు తగ్గాలంటే కొంత శారీరక వ్యాయామం కూడా అవసరం. బరువు తగ్గాల్సిన ప్రక్రియలో లయబద్ధమైన శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాలకు తగిన పని... ఈ అన్ని కార్యక్రమాలు సరైన సమన్వయంతో జరిగినప్పుడే కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇలా కొవ్వును తగ్గించే వ్యాయామాల్నే ఏరోబిక్స్ అంటారు. మన శరీరంలో పేరుకొని ఉండే శక్తినిల్వల్లో ప్రధానమైనది కొవ్వు. దాన్ని కరిగించి శక్తి రూపంలోకి మార్చడానికి ఒక యాంత్రిక చర్య (మెకానికల్ యాక్షన్ అంటే ఉదాహరణకు ఏరోబిక్స్) అవసరం. అందుకు వ్యాయామం ఉపకరిస్తుంది. ఇక్కడ కొవ్వు ఎలా కరుగుతుందో తెలుసుకోవడం అవసరం. ►ఊపిరితిత్తులు – శ్వాసించడం ద్వారా ప్రాణవాయువు ఊపిరితిత్తులను చేరుతుంది. సరిగా శ్వాసించడం వల్ల బయటి వాయువుల నుంచి ఆక్సిజన్‌ను ఎక్కువ గ్రహించగలుగుతాం. ►గుండె, రక్తనాళాలు – గుండె, రక్తనాళాలు ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను శరీరంలోని కణజాలలకు అందచేస్తాయి. ఎరోబిక్ ద్వారా (ఓ నిర్ణీత పరిమితిలో) ఎంతగా గుండె కొట్టుకునేలా చేయగలిగితే అంత సమర్థంగా ఆక్సిజన్, పోషకాల అందజేత ప్రక్రియను మెరుగుపరచవచ్చు. ►పనిచేసే కండరాలు – ఇవి ఆక్సిజన్‌ను, పోషక పదార్థాలను గ్రహిస్తాయి. చక్కగా శ్వాసించడం, గుండె అధికంగా కొట్టుకోవటం, కండరాల పనితీరు– ఇవన్నీ శరీరంలో కొవ్వు కరిగేందుకు ఉపకరిస్తాయి. పై మూడు ప్రక్రియలను సమన్వయపరుస్తున్నప్పుడు చక్కటి ఫలితం ఉంటుంది. అందుకు బాగా ఉపయోగపడే వ్యాయామాలే ఏరోబిక్! అంటే... ఉదా. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు కొవ్వుని తగ్గించటంలో బాగా ఉపయోగపడతాయి. -
ఆరోగ్యమస్తు
ఒకప్పుడు సౌందర్యంపైనే మక్కువ చూపిన మహిళలు నేడు శారీరక ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నారు. పురుషులకు దీటుగా మహిళలు సైతం వ్యాయామంతో పాటు ఏరోబిక్, జుంబా డ్యాన్సులపై ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఉదయం..సాయంత్రం వేళల్లో తీరిక దొరికినప్పుడు వాకింగ్ చేస్తూ ఒబెసిటీ లాంటి సమస్యలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు): నిత్యం ఒడిదుడుకుల జీవన విధానం.. శారీరక శ్రమ లేకపోవడం, ఆహార అలవాట్ల కారణంగా అత్యధిక శాతం మంది స్థూలకాయులుగా మారుతున్నారు. ఒబెసిటీ బారిన పడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధిక శాతం ఉంటున్నట్లు అంచనా. నగర జనాభాలో 33 శాతం మంది ఒబెసీటీతో బాధపడుతుంటే మహిళలు 40 శాతంగా ఉన్నట్లు అంచనా. ఒబెసిటీ మహిళల్లో 13 నుంచి 18 ఏళ్ల వారు 20 శాతం మందిæ, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వారు 33 శాతం మంది, 35 ఆ పైన వయస్సు కలిగిన వారు 40 శాతం మంది ఉన్నట్లు ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ వంటి వ్యా«ధులతో పాటు నడుంనొప్పి వంటి సమస్యలు వీరు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీని అధిగమించేందుకు మహిళలు ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నారు. వ్యాయామంపై ప్రత్యేక దృష్టి ఉదయం, సాయంత్రం పురుషులతో పాటు, మహిళలు వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తున్న వారిలో 45 ఏళ్లు పైబడినవారు ఉంటున్నారు. కాగా 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు ఏరోబిక్ చేస్తుండగా, యువత జుంబా డ్యాన్స్‌పై మక్కువ చూపుతున్నారు. దీంతో మహిళల కోసం ప్రత్యేక ఫిట్నెస్ సెంటర్లతో పాటు ఏరోబిక్, జుంబా డ్యాన్సు సెంటర్లు వెలుస్తున్నాయి. ఫిట్‌నెస్‌కు ప్రత్యేక ప్రొగ్రామ్స్ ► మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రొగ్రామ్స్‌ను అమలు చేస్తున్నారు. నిర్ధేశిత సమయంలో వ్యాయామం చేయడం ద్వారా ఫిట్‌నెస్‌కు ప్రయత్నిస్తున్నారు. ► గర్భిణులు ప్రసవం ముందు, ప్రసవం తర్వాత పెల్విస్ ఫ్లోర్ మజిల్స్ ఎక్స్ర్సైజ్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. సుఖప్రసవం జరిగేలా మజిల్స్‌ను సిద్ధంచేయడంతో పాటు ప్రసవం తర్వాత చర్మం యథాస్థితికి చేరుకునేందుకు పోస్ట్‌నేటల్ పెల్విస్ ఫ్లోర్ మజిల్స్ ఎక్స్‌ర్‌సైజ్ ఎంతగానో దోహదం చేస్తుంది. ► ప్రస్తుతం హార్మోన్ల లోపంతో సంతానలేమితో ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వారు మందులు వాడాల్సిన అవసరం లేకుండా వ్యాయామం, ఒత్తిడిని అధిగమించే టెక్నిక్స్, మెడిటేషన్ ద్వారా హార్మోన్స్ సమతుల్యంగా ఉండేలా చూస్తున్నారు. ఇవి చాలా మందిలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ► పిల్లల్లో అధికశాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. అలాంటి వారికోసం అనేక వ్యాయామాలతో పాటు క్రీడల్లో భాగస్వామ్యం కల్పించేలా పలువురు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. జ పీసీఓడీ సమస్యతో నెలసరి సరిగా రాని వారికి లైఫ్ స్టయిల్ మోడిఫికేషన్, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటి పక్రియల ద్వారా సక్రమంగా వచ్చేలా చేయవచ్చునని వైద్యులు చెపుతున్నారు. ► అధిక బరువులో బాధపడుతున్న మహిళలు ఏరోబిక్పై ఆసక్తి చూపుతున్నారు. రోజుకి 20 నుంచి 35 నిమిషాలు ఎరోబిక్ చేయడం ద్వారా వెయిట్‌లాస్‌తో పాటు, ఒత్తిడిని అదిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ► జుంబా డ్యాన్స్‌పై ప్రస్తుతం యువతలో క్రేజ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారు జుంబా డ్యాన్స్ చేస్తున్నారు. అధిక బరువుతో బాధపడే వారు జుంబా డ్యాన్స్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు నిపుణులు చెపుతున్నారు. వ్యాయామంతో ఎన్నో ఉపయోగాలు వ్యాయామం, ఏరోబిక్ చేయడం ద్వారా ఫిట్నెస్తో పాటు, ఒత్తిడిని అధిగమించవచ్చు. మెడిటేషన్, యోగాపై సైతం మహిళలు దృష్టి సారిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు, అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.గర్భిణులు సుఖప్రసవం కోసం ప్రీనేటల్, పోస్ట్‌నేటల్ పెల్విస్ ప్లోర్ వ్యాయామంపై మహిళలకు మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రసవం అనంతరం శరీర ఆకృతిలో మార్పులను నివారించేందుకు మంచి వ్యాయామ పద్ధతులు ఉన్నాయి. – డాక్టర్ వీబీ రాజేంద్రప్రసాద్, ఫిజియోథెరపిస్ట్ -
యోగా విత్ లైవ్ మ్యూజిక్
ఆడియో మోగుతుంటే ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయుడం మామూలే. సజీవ సంగీతం వింటూ యోగసాధన చేయుడం మాత్రం కచ్చితంగా ఒక కొత్త అనుభవం. ఇలాంటి అనుభవాన్ని నగర వాసులకు అందించేందుకు తొలిసారిగా ‘యోగా విత్ లైవ్ మ్యూజిక్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ యోగా శిక్షకురాలు మానసీ గులాటీ. హోటల్ మారియట్‌లో నవంబర్ 9న సాయుంత్రం 4.00 నుంచి 6.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. యోగాసనాలు కండరాలకు, కీళ్లకు వ్యాయామం కల్పిస్తే, సంగీతం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని, సంగీతం వింటూ యోగసాధన చేస్తే, ఏకకాలంలో మనశ్శరీరాలు రిలాక్స్ అవుతాయని గులాటీ చెబుతున్నారు. అలాగే, దేశంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమంలో ‘ఫేస్ యోగా’ను పరిచయం చేయనున్నారు. ‘ఫేస్ యోగా’తో ముదిమిని దూరం చేయవచ్చని, ముఖసౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవచ్చని చెబుతున్నారు.