breaking news
adikritika
-
ఆడికృత్తిక: మొక్కులు చెల్లించుకున్న భక్తులు
-
భక్తిశ్రద్ధలతో ఆడికృత్తిక
నెల్లూరు(బృందావనం): ఆడికృత్తికను పురస్కరించుకొని నగరంలోని వివిధ ఆలయాల్లో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి విశేషాభిషేకాలు, పూజలను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూలాపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో కొలువైన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అగ్రహారోత్సవం జరిగింది. నెమలివాహనంపై విశేషాలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు బాలాజీశర్మ, శ్రీరామకవచం కోటేశ్వరశర్మ, శ్రీశైలం భార్గవశర్మ, ధూర్జటి వేణుగోపాలశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా రమణశేఖర్, విజయ వెంకటేష్, హిమకైలాస్ వ్యవహరించారు. ఈఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. ఉస్మాన్సాహెబ్పేటలోని అన్నపూర్ణ సమేత కాశీవిశ్వనాథస్వామి ఆలయంలో కొలువైన వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి సాయంత్రం పూలంగిసేవ వైభవంగా జరిగింది. దేవస్థాన పాలకమండలి చైర్మన్ కొలపర్తి వెంకటరమేష్కుమార్ పర్యవేక్షించారు. కోటమిట్టలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలను నిర్వహించారు.