breaking news
Abdu Rozik
-
పెళ్లి క్యాన్సిల్ : బ్రేకప్ ప్రకటించిన బిగ్ బాస్ ఫేం, గాయకుడు
హిందీ బిగ్ బాస్ 16తో ఫేమస్ అయిన ప్రముఖ సింగర్ అబ్ధు రోజిక్ సంచలన విషయాన్ని ప్రకటించాడు. షార్జాకు చెందిన అమీరాతో త్వరలోనే పెళ్లి అని అట్టహాసంగా ప్రకటించిన అబ్ధుల్ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు తాజాగా వెల్లడించాడు. దీంతో ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నిర్ణయంతో షాక్ అయ్యారు.అబ్దు అమీరా ఏప్రిల్ 24, 2024న దుబాయ్‌లోని మజ్లిస్ షార్జాలో విలాసవంతమైన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 7న జరగాల్సిన వీరి పెళ్లి చేసుకోబోతున్నామని కూడా ప్రకటించారు. కానీ అబ్దు బాక్సింగ్ మ్యాచ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ జంట ఇప్పుడు విడిపోవడానికి నిర్ణయించు కున్నారు. తమ సాంస్కృతిక విభేదాలే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ నిర్ణయం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు ఇది అవసరమని పేర్కొన్నాడు. అందరూ అర్థం చేసుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాదు సమయం వచ్చినప్పుడు ప్రేమ తనను వెతుక్కుంటూ వస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. (డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్) కాగా తజికిస్థాన్ సింగర్ అయిన అబ్దు రోజిక్ తన సాంగ్స్‌తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత బిగ్ బాస్ 16 ద్వార ఒక రేంజ్లో క్రేజ్ సంపాదించాడు. సంగీత కెరీర్ ద్వారా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మే 9న ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిశ్చితార్థ వేడుక చిత్రాలను కూడా పంచుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపరిచాడు. అమీరా-అబ్దు పెళ్లికి సల్మాన్ ఖాన్, నే-యో, ర్యాన్ గార్సియా, జాసన్ డెరులో, మైక్ టైసన్ లాంటి టాప్ సెలబ్రిటీలు రానున్నారని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా విడిపోతున్నట్టు ప్రకటించారు. విభేదల పరిష్కారానికి ప్రయత్నాలు ఉన్నప్పటికీ, వారు చివరికి విడిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతానికి, అబ్దుతన వ్యక్తిగత, ,వృత్తిపరమైన ఎదుగుదలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.ఇవీ చదవండి: నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖవింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా! -
పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే
బిగ్ బాస్ రియాలిటీ షోతో చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. అలా హిందీలో 16వ సీజన్లో పాల్గొన్న మరగుజ్జు తజికిస్థాన్ సింగర్ అబ్దు రోజిక్ కూడా చాలా ఫేమ్ సొంతం చేసుకున్నాడు. తనదైన పాటలు, కామెడీ టైమింగ్‌తో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. 20 ఏళ్ల అబ్దు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో దుబాయికి చెందిన ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు. జూలైలో పెళ్లి ఉంటుందని చెప్పాడు. కానీ ఇప్పుడు దాన్ని వాయిదా వేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)20 ఏళ్ల అబ్దు రోజిక్.. షార్జాకు చెందిన అమీరాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. జూలై 7న నిఖా(ముస్లిం పద్ధతిలో పెళ్లి) చేసుకుంటానని సోషల్ మీడియాలో ప్రకటించాడు. కానీ ఇప్పుడీ వేడుక కాస్త అబ్దు.. బాక్సింగ్ మ్యాచ్ వల్ల వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే రివీల్ చేశాడు. జూలై 6న బాక్సింగ్ టైటిల్ కోసం పోటీ పడే మ్యాచులో ఛాన్స్ వచ్చిందని, ఇందులో పాల్గొంటే చాలా డబ్బు వస్తుందని, తనకు ఇది ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పాడు.అసలు బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేసే ఛాన్స్ వస్తుందని ఊహించలేదని చెప్పిన అబ్దు.. ఈ ఏడాది తన జీవితంలో చాలా మంచి విషయాలు జరిగాయని వాటిలో ఇదొకటి అని అన్నాడు. అయితే అనుకోని విధంగా బాక్సింగ్ మ్యాచ్ కోసం నిఖా వాయిదా వేసుకోక తప్పట్లేదని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్)