breaking news
Recipes
-
చల్లటి చలిలో కారం కారంగా కరకరలాడే పొటాటో పాన్‌కేక్స్ చేయండిలా!
చలి కొరుకుడుని తట్టుకోవాలంటే నోటికి కాస్త వేడివేడి రుచులు తగలాల్సిందే. వేడితోపాటు కారం, కరకర లాడే కమ్మదనం తోడయితే చలిని కూడా కొరికేయవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు. కావలసిన పదార్థాలు: ఉడికించి చిదుముకున్న బంగాళ దుంపలు – రెండు కప్పులు గుడ్డు – ఒకటి మైదా – ముప్పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు చీజ్ తరుగు – కప్పు; క్యారట్ తురుము – అరకప్పు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – రెండు టీస్పూన్లు నూనె – అరకప్పు పుల్లటి పెరుగు – గార్నిష్‌కు సరిపడా తయారీ విధానం: గిన్నెలో చిదిమిన దుంపల మిశ్రమం, గుడ్డుసొన, మైదా, స్ప్రింగ్ ఆనియన్, చీజ్ తరుగు, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ఈ మిశ్రమం చేతులకు అంటుకుంటున్నట్లు అయితే మరో టేబుల్ స్పూను మైదా వేసి కలపాలి. పిండి ముద్దను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.ఇరవై నిమిషాల తరువాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసి పాన్‌కేక్‌లా వత్తుకోవాలి ∙బాణలిలో నూనె వేయాలి. బాగా కాగిన∙నూనెలో ఒక్కో పాన్‌కేక్‌ను వేసి మీడియం మంట మీద కాల్చాలి. క్రిస్పీగా బ్రౌన్ కలర్లోకి మారాక పాన్కేక్లను తీసేయాలి. పాన్కేక్పైన కొద్దిగా పుల్లటి పెరుగువేసి సర్వ్ చేసుకోవాలి. (చదవండి: దేవి నవరాత్రుల్లో వెరైటీగా దెహరోరి స్వీట్ ట్రై చేయండి!) -
ప్రాన్స్ కార్న్ ఫ్రిటర్స్
కావలసినవి: చిక్కటి పాలు – పావుకప్పు, గుడ్లు – 4, మొక్కజొన్న పిండి – అర కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు, రొయ్యలు – 20 లేదా 25 (ఉప్పు, కారం, మసాలా కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి), స్వీట్ కార్న్ – రెండున్నర కప్పులు (ఉడికించి మిక్సీ పట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు –2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా తరగాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాలు, మూడు గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో స్వీట్ కార్న్ గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని, ఉడికించిన ఒక్కో రొయ్యతో కలిపి.. చేత్తో చిన్నగా ఒత్తి, వడలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. (చదవండి: ఓట్స్ – యాపిల్ లడ్డూలు) -
ఓట్స్ – యాపిల్ లడ్డూలు
కావలసినవి: యాపిల్ – 3 మీడియం సైజ్ (తొక్క, గింజలు తీసి గుజ్జులా చేసుకోవాలి) ఓట్స్ పౌడర్ – అర కప్పు (నెయ్యితో దోరగా వేయించుకోవాలి) కొబ్బరి కోరు – 2 కప్పులు, పంచదార – 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్– 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి – అర టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ – గార్నిష్‌కి కొద్దిగా (అభిరుచిని బట్టి) నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో యాపిల్ గుజ్జు, కొబ్బరి కోరు, పంచదార, మిల్క్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, ఓట్స్ పౌడర్, యాలకుల పొడి, నెయ్యి వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకోవాలి. వాటిపైన డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొద్దికొద్దిగా పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. (చదవండి: పొటాటో పాప్ కార్న్.. ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి) -
ఎంతో టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ రోల్స్ చేసుకోండి ఇలా!
మీల్ మేకర్ రోల్స్ కావలసినవి: చపాతీలు– 5 (గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీలు చేసుకుని, వేయించి పక్కన పెట్టుకోవాలి) మీల్ మేకర్ – 2 కప్పులు (ముందుగా వేడినీళ్లలో వేసుకుని కాసేపు ఉంచి.. నీళ్లు వాడిన వెంటనే కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 నిమిషం పాటు అటూ ఇటూగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి) క్యాప్సికమ్, టొమాటో– 2 చొప్పున (ముక్కలు కట్ చేసుకోవాలి) ఉల్లిపాయలు– 2 (సగం గార్నిష్‌కి), పచ్చిమిర్చి– 4 (చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి) బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి, జీలకర్ర పొడి – అర టీ స్పూన్ చొప్పున, పసుపు – చిటికెడు, టొమాటో కెచప్ – 1 టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా నూనెలో సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాసేపు వేగించి.. అందులో పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, మీల్ మేకర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుని కూరలా దగ్గరపడే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, టొమాటో కెచప్ వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా కాల్చిన చపాతీలలో.. ఓవైపు ఈ కర్రీ వేసుకుని రోల్స్‌లా చుట్టుకోవాలి. మిగిలిన ఉల్లిపాయ ముక్కలతో వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. (చదవండి: వడలు పులుసుపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!)