అధిక కాంతిలో నిద్రిస్తే..స్థూలకాయం తప్పదు! | 'Too much light in bedroom bad for your waistline' | Sakshi
Sakshi News home page

అధిక కాంతిలో నిద్రిస్తే..స్థూలకాయం తప్పదు!

Jun 1 2014 1:47 PM | Updated on Sep 2 2017 8:10 AM

మీ శరీరంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని అధిక బరువు పెరుగుతున్నారా? అయితే ఒకసారి నిద్రించే సమయంలో గదిలోని పరిస్థితులపై దృష్టి పెట్టండి.

లండన్: మీ శరీరంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని అధిక బరువు పెరుగుతున్నారా? అయితే ఒకసారి నిద్రించే సమయంలో గదిలోని పరిస్థితులపై దృష్టి పెట్టండి.  ఎందుకంటే మీకు తెలియకుండానే బరువు పెరిగితే.. అందుకు మనం పడుకునే గదిలో అధిక కాంతి ఉండటమేనట. బ్రిటన్ కు చెందిన కేన్సర్ రీసెర్చ్ సెంటర్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇందుకు గాను 1,13,000 మంది 40 ఏళ్ల దాటిన మహిళలను పరిశోధించారు.

 

వీరిలో కొంతమంది అధిక కాంతిలో నిద్రించే కారణంగా జీవక్రియలో పలు మార్పులు చోటు చేసుకుని స్థూలకాయం రావడానికి దోహదం చేసిందని ప్రొఫెసర్ ఆంటోని స్వెర్ డ్లో పేర్కొన్నారు.  ముఖ్యంగా మహిళలు రాత్రి పడుకునే ముందు కాంతితో కూడిన లైట్లను వినియోగిస్తే ఈ తరహా రోగాల బారిన పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement