సూరత్ను తలదన్నేలా టెక్స్టైల్ పార్కు: కేసీఆర్ | will construct world class textile park in warangal, says cm kcr | Sakshi
Sakshi News home page

సూరత్ను తలదన్నేలా టెక్స్టైల్ పార్కు: కేసీఆర్

Dec 29 2014 5:40 PM | Updated on Aug 14 2018 10:51 AM

సూరత్ను తలదన్నేలా టెక్స్టైల్ పార్కు: కేసీఆర్ - Sakshi

సూరత్ను తలదన్నేలా టెక్స్టైల్ పార్కు: కేసీఆర్

సూరత్ నగరాన్ని తలదన్నే రీతిలో వరంగల్ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

సూరత్ నగరాన్ని తలదన్నే రీతిలో వరంగల్ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ ప్రాంతాల నుంచి సూరత్ వలస వెళ్లిన కార్మికులను తిరిగి పిలిపిస్తామని ఆయన చెప్పారు. వరంగల్ నగరంలో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని అన్నారు. ఇక నుంచి రహదారులు, భవనాల శాఖను పూర్తిస్థాయిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావే చూసుకుంటారని ఆయన తెలిపారు.

వరంగల్ నగరం చుట్టూ రింగురోడ్డు ఏర్పాటు కోసం ఆయన ఏరియల్ సర్వే చేశారు. టెక్స్టైల్ పార్కు నిర్మించాలని తలపెట్టిన జయగిరి ప్రాంతాన్ని కేసీఆర్ సందర్శించారు. అన్ని శాఖల అధికారులతో ఆయన ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement