ఆర్టీసీకి బకాయిల్లేం.. 

TSRTC Strike: No Arrears To RTC From Government Affidavit To High Court - Sakshi

 ఏకతాటిపై ప్రభుత్వం.. జీహెచ్‌ఎంసీ

సమర్థించిన ఆర్టీసీ..

హైకోర్టులో వేర్వేరుగా కౌంటర్లు

నేడు విచారణ జరపనున్న ధర్మాసనం  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి బకాయిల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఒకే మాటపై నిలిచాయి. ఆరీ్టసీకి ఏ రకంగానూ బకాయిలు లేమని ప్రభుత్వం చెప్పగా.. సంస్థకు తాము ఇవ్వాల్సిన అవసరమే లేదని జీహెచ్‌ఎంసీ స్పష్టంచేసింది. ఈ రెండు వాదనలను ఆర్టీసీ ఎండీ సమరి్థంచారు. మొత్తానికి ముగ్గురూ కలసి ఆరీ్టసీకి చెల్లించాల్సింది ఏమీ లేదని హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మలు వేర్వేరుగా ఉన్నత న్యాయస్థానంలో కౌంటర్లు దాఖలు చేశారు. 

ఆర్టీసీనే ప్రభుత్వానికి బకాయి: – ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి 
ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించింది. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ బకాయి పడలేదు. ఆర్టీసీనే మోటారు వాహన పన్ను (ఎంవీ ట్యాక్స్‌) కింద ప్రభుత్వానికి 2017–18 నుంచి రూ.540.16 కోట్లు బకాయి పడింది. ఆరీ్టసీకి రాష్ట్ర ప్రభుత్వం రుణం రూపంలో డబ్బు ఇవ్వడమే తప్ప, ఆ రుణాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించిన చరిత్ర ఆ సంస్థకు లేదు. ఇచి్చన రుణాన్ని తిరిగి చెల్లించాలని ఆరీ్టసీకి ఇన్నేళ్లలో ఏనాడు కూడా ప్రభుత్వం నోటీసు జారీ చేసింది లేదు. తీసుకున్న రుణానికి ఫలానా సమయంలోపు వడ్డీ చెల్లించాలన్న గడువుంటుంది. అయితే ఇప్పటివరకు ఆర్టీసీ విషయంలో అటువంటి గడువేదీ నిర్దేశించలేదు. ఈ రుణాలను రోజువారీ నిర్వహణకు, బస్సుల కొనుగోలుకు, బస్సు షెడ్ల నిర్మాణానికి ఉపయోగించుకునే వెసులుబాటును ఆరీ్టసీకి ఇచ్చారు. వివిధ వర్గాల పౌరులకు ఇచ్చిన రాయితీల తాలూకు డబ్బును ప్రభుత్వం చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువే ఇచ్చింది. రాయితీల కింద రూ.1,230.20 కోట్లు, పెట్టుబడుల నిమిత్తం రూ.1,219 కోట్లు, రుణం కింద రూ.1,294.23 కోట్లు, బస్సుల కొనుగోలుకు రూ.160.12 కోట్లు.. ఇలా మొత్తం రూ.3,903.55 కోట్లు చెల్లించింది. ఆరీ్టసీకి జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ప్రభుత్వమే ఇచ్చింది. అందువల్ల జీహెచ్‌ఎంసీ ఎటువంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరీ్టసీకి జీహెచ్‌ఎంసీ రూ.1,492 కోట్ల మేర రుణపడి ఉందని నేను చెప్పలేదు. ఆర్టీసీ అంత మొత్తం జీహెచ్‌ఎంసీ నుంచి కోరుతోందని మాత్రమే చెప్పాను. 2014–15 నుంచి 2017–18 వరకు ఆరీ్టసీకి వివిధ పద్దుల కింద రూ.2,786.16 కోట్లు ఇచ్చాం. 2018–19లో రూ.662.39 కోట్లు, 2019–20లో రూ.455 కోట్లు విడుదల చేశాం.
 
మా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది – జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ 
ఆర్టీసీ కోరుతున్నట్లు నష్టాలను భరించే స్థితిలో జీహెచ్‌ఎంసీ లేదు. 2016 మే వరకు రూ.137.95 కోట్లు చెల్లించాం. అదే ఏడాది మరో రూ.198.45 కోట్లిచ్చాం. 2016 అక్టోబర్‌ నాటికి జీహెచ్‌ఎంసీ రూ.562.98 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉంది. ఈ లోటు కొనసాగి 2017–18కు రూ.313.10 కోట్లు, 2018–19కు రూ.768.20 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఆ లోటు కొనసాగుతోంది. 2016–17 సంవత్సరానికి ఆరీ్టసీకి రూ.273.84 కోట్లు విడుదల చేసేలా చూడాలని ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని కోరింది. అయితే ఆర్థిక సమస్యల వల్ల ఆ మొత్తాన్ని చెల్లించే పరిస్థితిలో లేమని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్సులను నడపడం వల్ల వచి్చన నష్టాలను భరించాలని ఆర్టీసీ మమ్మల్ని కోరుతూ వచి్చంది. అయితే మా ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే డబ్బు చెల్లించగలమని స్పష్టంగా చెప్పాం. అసలు చట్ట ప్రకారం ఆర్టీసీకి మేం ఎటువంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరమే లేదు. 

ఆర్టీసీకి ప్రభుత్వం అదనపు చెల్లింపులే చేసింది –  ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ 
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ స్థితిగతులపై రవాణా మంత్రికి 11.9. 2019న అంతర్గత నివేదిక ఇచ్చాం. మంత్రికి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి గురించి వివరించాం. ఈ సందర్భంగా వివిధ పద్దుల కింద ప్రభుత్వం ఆరీ్టసీకి విడుదల చేసిన నిధుల గురించి వివరించాం. దీని ఫలితంగా 2019–20 సంవత్సరానికి బడ్జెట్‌లో కేటాయించిన రూ.550 కోట్లకు గాను ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.455 కోట్లు విడుదలయ్యాయి. వాస్తవానికి ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఎటువంటి మొత్తాన్ని రుణపడి లేదు. మం త్రికి చెప్పిన లెక్కలు జీహెచ్‌ఎంసీ నుంచి ఆరీ్టసీకి రావాల్సినవి కావు. ప్రభుత్వం గ్యారెంటీగా ఉన్న రుణం రూ.345 కోట్ల గురించి కూడా మంత్రికి వివరించాం. రాష్ట్ర విభజనకు ముందు లెక్కలు అందుబాటులో లేవు. వివిధ వర్గాల పౌరులకు వచి్చన రాయితీల మొత్తం రూ.3,006.15కోట్లు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ అందుకున్నది రూ.3,903.55 కోట్లు. ప్రభుత్వం రూ.897.40 కోట్లు అదనంగా చెల్లించింది. దీనికి తోడు రూ.850 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీగా ఉంది. ఇచి్చన నిధులను వాడుకునే స్వేచ్ఛను ఆరీ్టసీకి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం తాను ఇచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించాలని కోరడం గానీ, వడ్డీ చెల్లించాలని అడగటం గానీ ఇప్పటివరకు చేయలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చిన నష్టాలకు స్పందించి గతంలో రూ.336.40కోట్లు జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. 2019 అక్టోబర్‌ లోనూ ఇలానే అడిగాం. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అందువల్ల నష్టాలను భరించే స్థితిలో లేమని జీహెచ్‌ఎంసీ చెప్పింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top