
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కారుణ్య నియమాకాలకు పచ్చజెండా ఊపింది. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు, చనిపోయినవారి పిల్లలకు కారుణ్య నియామకాల్ని చేపట్టాలని ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారి ఆకాంక్షలకు అనుగుణంగా సింగరేణి సంస్థ శనివారం సర్క్యులర్ జారీచేసింది.
సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కారుణ్య నియామకాల సర్క్యులర్ జారీ కావడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, ఎంపీ కవితకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.