కార్మికులు నాయకత్వాన్ని నేర్పారు | RTC lifetime'm grateful for workers | Sakshi
Sakshi News home page

కార్మికులు నాయకత్వాన్ని నేర్పారు

Mar 30 2016 2:18 AM | Updated on Jul 25 2018 2:52 PM

కార్మికులు నాయకత్వాన్ని నేర్పారు - Sakshi

కార్మికులు నాయకత్వాన్ని నేర్పారు

ఆర్టీసీ కార్మికులు తనకు నాయకత్వాన్ని నేర్పారని వరంగల్ మేయర్, టీఎంయూ వరంగల్ రీజియన్ గౌరవాధ్యక్షుడు ....

జీవిత కాలం ఆర్టీసీ కార్మికులకు రుణపడి ఉంటా
ప్రజల మధ్య ఎలా ఉండాలో నేర్చుకున్నాను
మేయర్, టీఎంయూ గౌరవాధ్యక్షుడు నరేందర్


హన్మకొండ : ఆర్టీసీ కార్మికులు తనకు నాయకత్వాన్ని నేర్పారని వరంగల్ మేయర్, టీఎంయూ వరంగల్ రీజియన్ గౌరవాధ్యక్షుడు నన్నపునేని నరేం దర్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని జిల్లా బస్‌స్టేషన్‌లో టీఎంయూ ఆధ్వర్యంలో మేయర్ నన్నపునేని నరేందర్ సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు అండదండలతో టీఎంయూ రీజియన్ గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానన్నారు. గౌరవాధ్యక్షుడిని కావడం వలన ప్రజల మధ్యఎలా ఉండాలో నేర్చుకున్నాని చెప్పారు.  తాను కార్పొరేటర్‌గా గెలిచేందుకు ఆర్టీసీ కార్మికులు ఎంతగానో శ్రమించారని తెలిపారు.

అందుకే జీవిత కాలం ఆర్టీసీ కార్మికులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.  వరంగల్ రీజియన్‌లో టి. మజ్దూర్ యూనియన్ బలంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ టీఎంయూకు వెన్నుదన్నుగా ఉన్నారన్నా రు. పేదింటి బిడ్డను గుర్తించి తనను సీఎం కేసీఆర్ మేయర్‌ను చేశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎంయూ పై ప్రత్యర్థులు కావాలని దుష్ర్పచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. వచ్చే గుర్తింపు ఎన్నికలు ఏకపక్షంగా జ రుగుతాయని, వరంగల్ రీజియన్‌లోని అన్ని డి పోల్లో టీఎంయూ గుర్తింపును పొందుతుందనే ధీమా వ్యక్తం చేశారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథామరెడ్డి మాట్లాడుతూ టీఎం యూకు పెద్ద దిక్కుగా నిలిచి నిస్వార్థంగా సేవ చేసినందునే మేయర్‌గా అవకాశం వచ్చిందన్నారు.

ప్రజలకు చక్కని పాలన అందించి ప్రజ ల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు థామస్‌రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో ఎంప్లాయూస్ యూనియన్ మొత్తం తుడుచుకు పెట్టుకుపోయిందన్నారు.  ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్, ప్రముఖ మెజీషియన్ జూలకుంట్ల శ్రీనివాస్‌రెడ్డిని టీఎంయూ సన్మానించింది. ఈ సందర్భంగా ఎన్‌ఎంయు, ఈయూ నుంచి కార్మికులు టీఎంయూలో చేరా రు.  సభలో టీఆర్‌ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, కె.వాసుదేవరెడ్డి, టీఎంయూ నాయకులు వి.ఎస్.రెడ్డి, పిఆర్ రెడ్డి, పి.లక్ష్మయ్య, ఎం.ఎన్.రావు, ఈఎస్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement