వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఖరారుచేసింది.
వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. అధికార టీఆర్ ఎస్ పార్టీలో ఈ స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొన్న నెలకొన్న నేపథ్యంలో అవకాశం ఎవరికివ్వాలనే దానిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర సమాలోచనలు జరిపారు. చివరికి పల్లా పేరును ఓకే చేయడంతో నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఈ స్థానానికి మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి.
ఒక దశలో నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు బండ నరేందర్ రెడ్డికి గానీ, వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు రవీందర్ కు గానీ టికెట్ దక్కుతుందనే వార్తలు వినవచ్చాయి. కానీ చివరికి పల్లా రాజేశ్వర్ రెడ్డికే పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ దక్కింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థిగా నల్లగొండ స్థానం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలైన రాజేశ్వర్ రెడ్డి ప్రతస్తుతం టీఆర్ ఎస్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా కొనసాగుతున్నారు. అనురాగ్ విద్యాస్థల చైర్మన్గా, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడిగానూ పనిచేశారు. విద్యావేత్తగా మంచి పేరున్న పల్లా గెలుపుపై టీఆర్ ఎస్ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.