నల్లగొండ జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒకరు మృత్యువాతపడ్డారు.
నల్లగొండ జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒకరు మృత్యువాతపడ్డారు. వేగంగా వెళుతున్న మోటారుసైకిల్ అదుపుతప్పిమూలమలుపులోరోడ్డు పక్కన పాడుబావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న యువకుడు చనిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.