చార్జీల పెంపును విరమించుకోవాలి | Increase in charges can be avoided | Sakshi
Sakshi News home page

చార్జీల పెంపును విరమించుకోవాలి

Apr 10 2016 3:19 AM | Updated on Jul 11 2019 8:34 PM

విద్యుత్ , వినియోగ చార్జీలు పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ....

మాజీ మంత్రి శ్రీధర్‌బాబు,
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

 
 
కరీంనగర్ :
విద్యుత్ , వినియోగ చార్జీలు పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేర్వేరుగా తమ అభిప్రాయాలు తమ ప్రతినిధుల ద్వారా ఈఆర్‌సీ విన్నవించారు. చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్‌కు ప్రతినిధుల ద్వారా వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రంలో రెండేళ్లుగా కరువు నెలకొనడంతో 90 శాతం రైతు కూలీల కుటుంబాలు, వారిపై ఆధారపడ్డ వారు దీనావస్థలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్‌పీడీసీఎల్ తన నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకొని, దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపవద్దని, చార్జీల పెంపువల్ల చిరువ్యాపారులు, కుటీరపరిశ్రమలు, చేతివృత్తిదారులపై ప్రభావంపడి వేలా ది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. తక్షణమే విద్యుత్ చార్జీల పెంపు అంశంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయూలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement