
సాక్షి, మంచిర్యాల : కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల అసెంబ్లీ సీటును వేలంపాటు వేసిందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఆరోపించారు. ఆ వేలంలో తాను పాల్గొనలేదని.. నాన్‌లోకల్ అయిన, క్రిమినల్ కేసులున్న వ్యక్తికి టికెట్ కేటాయించారని ఆయన మండిపడ్డారు. సీటు దక్కిన ప్రేమ్‌సాగర్ చరిత్ర ఎలాంటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని.. అసాంఘిక శక్తులను ఓడించేందుకు తాను బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. బీజేపీ లేదా, బీఎస్పీ నుంచి పోటీచేస్తానని అరవింద్‌రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తానని వ్యాఖ్యానించారు.