ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌నంటూ హల్‌చల్ | Fake Food inspector | Sakshi
Sakshi News home page

ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌నంటూ హల్‌చల్

Jul 28 2015 11:21 PM | Updated on Sep 3 2017 6:20 AM

గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌నంటూ హల్‌చల్ చేసి వ్యాపారి నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించి

శివ్వంపేట : గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌నంటూ హల్‌చల్ చేసి వ్యాపారి నుంచి డబ్బు  గుంజేందుకు ప్రయత్నించి ప్రతిఘటన ఎదురుకాగానే పలాయనం చిత్తగించారు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన శివ్వంపేటలోని మహేష్‌గుప్తా కిరాణం దుకాణానికి మంగళవారం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లమంటూ పేర్కొం టూ తనిఖీలు చేపట్టారు. గుట్కాలు విక్రయిస్తున్నందున రూ.10వేల జరిమానా కట్టాలని ఆదేశించారు.

దీంతో కంగుతిన్న దుకాణ యజమాని జరిమానా ఎందుకు కట్టాలని గట్టిగా నిలదీశాడు. దీంతో వెంటనే రూ.3వేలు ఇస్తే ఎలాంటి కేసులు పెట్టమని పేర్కొనడంతో అనుమానం వచ్చి తోటి వ్యాపారులకు సమాచారం అందించాడు. వ్యాపారులంతా రావడంతో చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ విషయమై ఆరాతీయగా వచ్చిన నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు అని తేలడంతో అంతా అవాక్కయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement