తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అన్నారు.
కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం
నల్లగొండ టూటౌన్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అన్నారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కేంద్రం106 సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ఈ పథకాలను ప్రజలకు చేర్చి.. వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
మోదీ విదేశాల పర్యటనలతో దేశంలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా నిరుద్యోగు లకు ఉపా«ధి అవకాశాలు వచ్చాయన్నారు. ప్రధానమంత్రి ఇరిగేషన్ పథకం ద్వారా రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులకు తోడ్పాటు అందిస్తామన్నారు. రూ. 48 వేల కోట్లతో రాష్ట్రంలో 2,650 కిలో మీటర్ల జాతీయ రహదారులను కేంద్రం నిర్మించిందన్నారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.