హత్యకేసులో అనుమానితుడి ఆత్మహత్యాయత్నం | Accused of murder attempt | Sakshi
Sakshi News home page

హత్యకేసులో అనుమానితుడి ఆత్మహత్యాయత్నం

Jun 25 2014 3:15 AM | Updated on Sep 2 2017 9:20 AM

పోలీసుల భయంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంకరపట్నం మండలం మొలంగూర్ వద్ద ముత్తారానికి చెందిన రాజేందర్ ఆదివారం రాత్రి హత్యకు గురి కాగా, ఈ కేసులో తిమ్మాపూర్ మండలం మక్తపల్లెకు చెందిన మైలారం శంకర్‌ను పోలీసులు అనుమానించారు.

తిమ్మాపూర్ : పోలీసుల భయంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంకరపట్నం మండలం మొలంగూర్ వద్ద ముత్తారానికి చెందిన రాజేందర్ ఆదివారం రాత్రి హత్యకు గురి కాగా, ఈ కేసులో తిమ్మాపూర్ మండలం మక్తపల్లెకు చెందిన మైలారం శంకర్‌ను పోలీసులు అనుమానించారు.
 
 సోమవారం సాయంత్రం శంకరపట్నం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు మక్తపల్లెకు వచ్చి శంకర్‌ను, ఆయన భార్యను, స్నేహితులను విచారించారు. అనంతరం ఇంటివరకు అతడిని తీసుకుని పోలీసులు వెళ్లగా బాత్‌రూంకు వెళ్లివస్తానని ఇంటి వెనుకకు వెళ్లిన శంకర్ తిరిగి రాలేదు. పోలీసులు వెనక్కి వెళ్లి చూడగా శంకర్ గొంతును కత్తితో కోసుకున్నాడు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. ప్రైవేటు ఆసుపత్రిలో శంకర్ గొంతుకు శస్త్ర చికిత్స జరిగిందని, ఏమీ మాట్లడలేని స్థితిలో ఉన్నాడని స్థానికులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement