24 గంటల కరెంట్‌ సీఎం కేసీఆర్‌ ఘనత 

24-hour current is CM KCR credit - Sakshi

 రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్లు 

సెర్ప్‌ ఉద్యోగులను ఆదుకుంటాం 

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు 

సిరిసిల్ల: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్‌ను ఉచితంగా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, అంకిరెడ్డిపల్లె, రామచంద్రాపూర్‌ గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ  నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తామంటే.. రైతులే వద్దంటున్నారని అన్నారు. ఇందుకు కారణమైన ఆటోమేటిక్‌ స్టార్టర్లు తొలగిస్తే ఏ సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 40 లక్షల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అర్హులకు తప్పకుండా ఆసరా కల్పిస్తామని వెల్లడించా రు. రైతులకు పెట్టుబడిగా ఎకరాకి ఏటా రూ.8 వేలు అందివ్వడం చరిత్రాత్మకమని, దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. అందరికీ అన్నీచేసిన సీఎం కేసీఆర్‌.. సెర్ప్‌ ఉద్యోగులను ఆదుకుంటామని మంత్రి వెల్లడించారు.  

నీలవ్వకు నీడ కల్పించిన మంత్రి 
సిరిసిల్ల: గూడు లేని దళితురాలు నీలవ్వకు మంత్రి కేటీఆర్‌ సొంత ఖర్చుతో డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టించి ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన మేడిపెల్లి నీలవ్వ భర్త గతంలోనే చనిపోయాడు. కుమారుడు సుదర్శన్‌ ఆరేళ్లక్రితం క్యాన్సర్‌తో మృతి చెందాడు. రెండోకుమారుడు ఏడాది క్రితం అనారోగ్యంతో మృత్యువాతపడ్డాడు. కూతు రు వసంతకు వివాహం చేయగా ఇద్దరు కుమారులు జన్మించారు. కొంతకాలం తర్వాత భర్తతో విడాకులయ్యాయి. ఆ తర్వాత పెద్దకుమారుడు రమేశ్‌ పచ్చకామెర్ల వ్యాధితో చనిపోయాడు. మరోకుమారుడు చింటూ నీటితొట్టిలో పడి తుదిశ్వాస విడిచాడు. దీంతో వసంత తల్లి నీలవ్వ వద్దే ఉంటోంది.

ఇల్లు కూలిపోవడంతో నిలువ నీడలేని నీలవ్వ జిల్లెల్ల క్రాసింగ్‌ వద్ద పచ్చికంకులు కాల్చుతూ విక్రయించగా వచ్చే సొమ్ముతో కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో రామచంద్రాపూర్‌ గ్రామంలో గత ఆగస్టులో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నీలవ్వ మంత్రిని కలసి తన గోడు వెళ్లబోసుకుంది. స్పందించిన మంత్రి డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు. అప్పటికప్పుడే మేస్త్రీని మాట్లాడారు. తన సొంత నిధులు వెచ్చించి సిమెంటు, కంకర, ఇతర సామగ్రి సమకూర్చారు. ఇతర సామగ్రి కోసం మరికొన్ని నిధు లు అందజేశారు. ఇటీ వలే ఇంటి నిర్మాణం పూర్తయింది. శనివారం నీలవ్వ గృహప్రవేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఆమెతో రిబ్బన్‌ కట్‌ చేయించి గృహప్రవేశం చేశారు. హాజరైన అతిథులకు కేటీఆర్‌ ఖర్చులతోనే విందుభోజనం ఏర్పా టు చేశారు. నీలవ్వతో కలసి భోజనం చేశారు. మంత్రి స్వయంగా ఇల్లు కట్టించి, తనతో కలిసి భోజనం చేసి, కష్టాల నుంచి దూరం చేసినందుకు నీలవ్వ సంతోషపడింది. ఒకదశలో ఆమె కళ్లలో నీళ్లసుడులు తిరిగాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top