breaking news
-
త్వరలోనే వారి బండారం బయటపెడతా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ హయాంలో సిటీ చుట్టూ పక్కల భూముల చేతులు మారాయని, వాటి మీద సమగ్ర విచారణ జరగాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ది అక్రమాల చరిత్ర అని, అందుకే ఒకటి, రెండు రాష్ట్రాలకు పరిమితం అయ్యిందన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తే అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా లేదంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ అవసరం లేదని.. గత పదేళ్లలో అభివృద్ధికి బదులు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ దెబ్బ తీసిందని దుయ్యబట్టారు. దేశ అబివృద్ధి కోసం బీజేపీ లో చేరాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి వారి బండారం బయట పెడతామన్నారు. మేము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పీసీ సెక్రెటరీ గా ఉన్న అంకిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఫిబ్రవరి మొత్తం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీలో చేరికలు ఉంటాయి. చేరికలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. కేసీఆర్ కుటుంబం మీద కోపంతో కాంగ్రెస్‌కి ఓటేశారు. కాంగ్రెస్ గెలవలేదు .. బీఆర్ఎస్ను ఓడించారు. కాంగ్రెస్ గెలిచిన సమస్యలు పరిష్కారం కావు’’ అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. పార్టీని వీడనున్న మర్రి జనార్దన్‌రెడ్డి? -
రేవంత్లాంటోళ్లను కేసీఆర్ చాలామందినే చూశారు: కేటీఆర్
సాక్షి, మేడ్చల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. బీఆర్ఎస్ను బొందపెడతామని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని.. అలాంటి వాళ్ళను చాలా మందినే చూశామని అన్నారు. ఘట్కేసర్లో శుక్రవారం నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్‌లను కేసీఆర్ ఎంతోమందని చూశారు. ఎంతోమంది తీస్మార్ ఖాన్‌లను మాయం చేసి తెలంగాణా తెచ్చారు కేసీఆర్. పార్టీ కార్యకర్తలు ఎవరికి అన్యాయం జరిగిన అందరం బస్ వేసుకొని వస్తాం. మా బాస్‌లు ఢిల్లీలో లేరు. గుజరాత్‌లోనూ లేరు. లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారు. సెక్రటేరియట్లో కంప్యూటర్లు, జీవోలు ఉంటాయి.. లంకె బిందెలు ఉండవు. లంకెబిందెల కోసం వెదికేది ఎవరో ప్రజలకు తెలుసు. ప్రతి ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడుతాం.’ అని కేటీఆర్ అన్నారు. ‘2 లక్షల అప్పు తెచ్చుకోండి. నేను మాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆ హామీ ఎటుపోయింది. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. వాటికోసం కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు వేచి చూస్తున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల కడుపు కొట్టారు. కడుపు కాలిన ఆటోడ్రైవర్ ప్రజాభవన్ ముందు ఆటో కాలబెట్టాడు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని మండిపడ్డారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, ఆరు గ్యారంటీలు అమలు చేసేది లేదని అన్నారు. కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. మల్లారెడ్డిని ఢీ కొట్టలేరు మేడ్చల్‌లో మల్లారెడ్డితో పోటీ పడే పరిస్థితి ఎవరికీ లేదని అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు మల్లారెడ్డి అని తెలిపారు. 420 హామీలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలేనని.. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలన్నారు. చదవండి: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. మర్రి జనార్దన్‌రెడ్డి రాజీనామా? -
కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే దమ్ముందా?: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్: తన పాలనలో కేసీఆర్ ఏనాడూ ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించలేదని.. ఆలోచించి ఉంటే ఇవాళ నాగోబా ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చేదని నిలదీశారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన.. వేదిక నుంచి బీఆర్ఎస్పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఈ వేదిక సాక్షిగా చెబుతున్నా.. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటాం. ఈ అడవి బిడ్డల ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. తప్పకుండా ఆదివాసీ కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం. ఇందిరమ్మ సోనియా రాజ్యం తెచ్చుకుంటాం. కేసీఆర్‌నును నేరుగా అడుగుతున్నా. ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా?. నిజంగా అభివృద్ధి చేస్తే ఎందుకు నీళ్ళ కోసం నాగోబా గుడి కోసం రోడ్ల కోసం నిధులు మేము ఇచ్చే పరిస్తితి ఎందుకు వచ్చింది. చెరుకు పంటలో అడవి పందులు ఏ విధంగా దాడి చేస్తాయో అదే విధంగా తెలంగాణ పై కేసీఆర్ కుటుంబం దాడి చేసి విధ్వంసం చేశారు. .. ఎంత సేపు నీ బిడ్డలు నీ ఫామ్ హౌజ్ లు తప్ప.. రాష్ట్రంలోని బిడ్డల కోసం ఆలోచించావా?. కవిత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చావు. మరి స్టాఫ్ నర్సులు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చావా? అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బిల్లా రంగాలు(కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశిస్తూ..) ఎంత శాప నార్ధాలు పెట్టినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాదే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎవడ్రా కూల్చేది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే శాప నార్డాలు పెడుతున్నారు. మరి 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు మీరు?. ప్రభుత్వం కూలి పోతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా?. ఎవడ్రా కూల్చేది?. ప్రజల్లారా.. మీరు ఊరుకుంటారా?. చెట్లకు కట్టేసి భరతం పట్టండి. కేసీఆర్ పాపాల భైరవుడు. మళ్లీ జీవితంలో సీఎం కారు. మూడు నెలలకో, ఆరు నెలలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతాం. .. ఆరేడు ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. వస్తే మోదీకి అమ్ముకుందాం అనా?. దేశంలో ఉన్నవి రెండే కూటములు. ఒకటి మోదీ కూటమి.. రెండోది ఇండియా కూటమి. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి రానివ్వం. ఆ ఇంటి పిట్టను ఈ ఇంటి మీద వాలితే కాల్చి పారేస్తాం. మోదీ కేడీ(కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ..) ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. మళ్లీ మతం పేరుతో వాళ్లు ఎన్నికలకు వస్తున్నారు. మోదీ ఎవరి ఖాతాలో అయినా రూ.15 లక్షలు జమ చేశారా? సోయంబాపురావుకు కనీసం కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేకపోయారు. అలాంటప్పుడు ఓటేందుకు వేయాలి?. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురాలి. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి’’ అని ప్రజల్ని కోరారాయన. కడెం మరమ్మత్తుల బాధ్యత మాది కోటి ఎకరాలకు నీళ్లు అన్నావ్? వస్తావా కేసీఆర్ ఆదిలాబాద్‌ను చూపిస్తాం. హెలికాఫ్టర్ పెడతాం.. ఎక్కడ నీళ్లు ఇచ్చావో చూపించు అని కేసీఆర్‌పై రేవంత్ ధ్వజమెత్తారు. ఇక.. తెలంగాణలో మహిళలకు రూ. 500 కు సిలిండర్ గ్యాస్ అందించే పథకం త్వరలోనే అమలు చేస్తామని.. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ అన్నారు. ‘‘తుమ్మిడి హిట్టి వద్ద ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేసే బాధ్యత మాది’’ అని రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఆ రెండు హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు హామీల అమలులో భాగంగా.. త్వరలో రెండింటిని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో మాట్లాడరు. ఈ సందర్భంగా.. అతిత్వరలోనే రూ.500కి గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించారు. మరికాసేపట్లో ఇంద్రవెల్లి అమరుల స్థూపానికి గౌరవ వందనం సమర్పించి.. అక్కడి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ఆయన ప్రసంగిస్తారు. ప్రత్యేక పూజలు ఇక.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్‌రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. పార్టీని వీడనున్న మర్రి జనార్దన్‌రెడ్డి?
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: బీఆర్ఎస్కు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి షాక్ ఇవ్వనున్నారా?. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి చవి చూసిన జనార్దన్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసేందుకు ఢిల్లి పెద్దలలో మర్రి మంతనాలు జరిపారు. దీంతో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయోమయంలో పడ్డారు. నేడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్దన్‌రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ల రాజేష్ రెడ్డి 87,161 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన ఆయన.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్.. టీపీసీసీ భారీ ప్లాన్! -
విలువలు లోపించాయి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగ విలువలు లోపించాయని, అధికారం వచ్చాక తాము ఏది చేసినా చెల్లుతుందనే ధోరణి కొనసాగుతోందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా గురువారం ప్రముఖ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.. దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, చంద్రబాబునాయుడు గురించి రచించిన ‘మూడు దారులు’పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ జె.చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పరంగా విధివిధానాలు వేరైనా.. ముగ్గురి గమ్యం ఒక్కటేనని అన్నారు. పాదయాత్ర అనంతరం వై.ఎస్. రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. ఒక సందర్భంలో వైఎస్‌ను కలసినప్పుడు ఈ విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నానని తెలిపారు. నేరుగా ప్రజల చెంతకు వెళ్లి, వారికి నమ్మకం కల్పించిన నాయకుడే అధికారాన్ని పొందగలుగుతాడని ఆయన పేర్కొన్నారు. వైఎస్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పించి జననేతగా నిలిచారన్నారు. చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కాడు.. ఒక పాత్రికేయునిగా తాను చూసిన వాస్తవ సంఘటనలను తన అభిప్రాయాలుగా మూడు దారలుగా తీసుకువచ్చానని రచయిత దేవులపల్లి అమర్ అన్నారు. ఉత్తరాది రాజకీయ నాయకులకు దక్షణాదిలో కొనసాగుతున్న వాస్తవ రాజకీయ పరిణామాలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఇదే పుస్తకాన్ని ‘డక్కన్ పవర్ ప్లే’పేరుతో ఇంగ్లిష్‌లో కూడా తీసుకువచ్చానని చెప్పారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో అసమ్మతి నేతగా కొనసాగి, ప్రజల మొప్పుతో ఆ పార్టీనే తనపైన ఆధారపడేలా ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ఆయన అభిప్రాయపడ్డారు. పొత్తులతోనే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారుకానీ, చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కారని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసిన ప్రతీసారి బాబు ఓడిపోయారన్నారు. 1993లో ఎన్టీఆర్ తనకు జరిగిన మోసాన్ని తిప్పికొట్టి 1994లో మళ్లీ ముఖ్యమంత్రిగా నిలిచారని, కానీ కొద్ది రోజుల్లోనే ఆయనకు వెన్నుపోటు పోడిచి చంద్రబాబు సీఎంగా మారారని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన తండ్రికి భిన్నంగా ప్రయాణం చేశారని, ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ నిరాకరిస్తే ఆ పార్టీనే వదిలి ప్రజల చెంతకు చేరారని అన్నారు. కక్షసాధింపుతో ఆ పార్టీ ప్రభుత్వం కేసులు పెట్టినా 16 మాసాలు జైల్లో ఉండి, అనంతరరం ప్రజల మెప్పుతో 2019లో ఏపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారని కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరం, చక్రధర్, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టీడీపీ తరఫున లోకేశ్ పిటిషన్ ఎలా వేశారు?
సాక్షి, హైదరాబాద్: ‘వ్యూహం చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) కమిటీ జారీ చేసిన యు సర్టిఫికెట్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సింగిల్ జడ్జి విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. ఇక్కడకు అప్పీల్ వచ్చింది.. సమాచారం ఇవ్వడానికి ఇంకా సమయం కావాలని కోరడం ఆమోదయోగ్యం కాదు..’ అంటూ టీడీపీ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడి(అచ్నెన్నాయుడు, ఏపీ) అనుమతి లేకుండా పిటిషన్ వేయడానికి రిట్ పిటిషనర్(లోకేశ్)కు ఏం అధికారం ఉందని ప్రశ్నించింది. ‘విచారణకు సిద్ధమై రావాలి కదా.. సబ్జెక్ట్‌పై వాస్తవాలు వెల్లడించండి. పార్టీ నిబంధనల ప్రకారం ఏపీ అధ్యక్షుడి అనుమతి ఎందుకు తీసుకోలేదు?’ అని మండిపడింది. శుక్రవారం వరకు సమయం కావాలని టీడీపీ న్యాయవాదులు అడగడాన్ని తప్పుబట్టింది. వ్యూహం చిత్రానికి సీబీఎఫ్సీ ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నిర్మాత తరఫున సీనియర్ న్యాయవాది వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసి, చిత్ర విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు పూర్తి కావడంతో ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. -
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:15 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్... స్పీకర్ చాంబర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యేగా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారితోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. పార్టీ నేతల ఘన స్వాగతం గతేడాది డిసెంబర్లో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరగడం తెలిసిందే. దీంతో ఆయనకు వైద్యులు తుంటి మారి్పడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఫలితంగా అప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న కేసీఆర్ గురువారం ఊతకర్ర సాయంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రులు కె. తారక రామారావు, హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులతోపాటు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వెంట స్పీకర్ చాంబర్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలోని పీవీ హాల్లో కేసీఆర్‌కు పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. చాంబర్లో పనులు పూర్తికాకపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్... అసెంబ్లీలో తనకు కేటాయించిన చాంబర్లో ప్రత్యేక పూజలు చేయాలని భావించారు. అయితే వసతుల కల్పన పనులు పూర్తి కాకపోవడంతో నందినగర్‌లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా జనసమూహంలోకి వచ్చిన కేసీఆర్‌ను కలిసేందుకు బీఆర్ఎస్కు నేతలు పోటీ పడ్డారు. -
ఖమ్మం నుంచి అవకాశం ఇవ్వండి: మల్లు నందిని
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తెరపైకి కొత్త ముఖాలు వస్తున్నాయి. ఈసారి ఎంపీలుగా పోటీచేసే జాబితాలో పలువురు మంత్రుల కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తనకు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆమె గురువారం గాందీభవన్‌లో దరఖాస్తు సమర్పించారు. కాగా, ఇదే సీటుకు మరో సీనియర్ నేత మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ స్థానంలో ఆయన పోటీ చేస్తారనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది. ఇదే సీటు కోసం కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, మరో రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌లు కూడా పోటీలో ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బరిలో ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ హాట్‌సీటుగా మారిందనే చెప్పవచ్చు. రెండోరోజు 34 మంది దరఖాస్తు రెండోరోజు 34 మంది దరఖాస్తులు సమర్పించారు. ఆయా పార్లమెంట్ స్థానాల వారీగా చూస్తే మహబూబాబాద్‌కు 9, నాగర్‌కర్నూల్‌కు 8, వరంగల్‌కు 6, భువనగిరికి 6, ఖమ్మంకు 2, నిజామాబాద్‌కు 3 దరఖాçస్తులు వచ్చాయి. భువనగిరి సీటుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఉస్మానియా విద్యారి్థనేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ దరఖాస్తు సమర్పించారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత దరఖాస్తు అందజేశారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 41 మంది దరఖాస్తు చేశారు. కాగా ఈనెల 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉండటంతో శుక్ర, శనివారాల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని గాం«దీభవన్వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
రేపు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్.. అమలులోకి మరో మూడు గ్యారెంటీలు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేపు(శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత ఇది ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించనున్నారు. మూడు పథకాల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను సెంటిమెంట్‌గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే మొదటి సభ నిర్వహించారు. నాడు ‘దళిత, గిరిజన దండోరా’ పేరిట నిర్వహించిన సభకు లక్షకు పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటినుంచే కాంగ్రెస్‌పై ప్రజల్లో మక్కువ పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. దానికి తగ్గట్టుగానే ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడం, రేవంత్‌రెడ్డి సీఎం కావడం జరిగిపోయాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి గడ్డ మీదనుంచే మొదలుపెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, శాసనసభ ఎన్నికల్లో నాలుగు బీజేపీ, రెండు బీఆర్ఎస్ గెలువగా, ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్‌గా తీసుకొని సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. మొత్తంగా ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఈ గడ్డ మీద నుంచి సమరశంఖం పూరించనున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
BRS: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. పార్లమెంట్ ఎన్నికలకు భయపడొద్దంటూ ధైర్యం చెప్పారాయన. తుంటి ఆపరేషన్ నుంచి కోలుకున్న కేసీఆర్ ఇవాళ(గురువారం) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం నందినగర్ నివాసంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో ముఖ్యనేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఆ సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్త. ఏదో విని చెబితే.. ట్రాప్‌లో పడొద్దు. మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా.. జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసి వినతులు ఇవ్వండి. అదీ జనం మధ్య ఉన్నప్పుడే చేయండి. ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవాలంటే పార్టీకి ముందుగా సమాచారం అందించండి. పార్లమెంట్ ఎన్నికల్లో 6 నుంచి 8 స్థానాలు బీఆర్ఎస్కు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ హామీలను ఇలాగే సాగదీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? ఉండదా? అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది. బీఆర్ఎస్ను బొందపెడతామంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆ వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి’’అని కేసీఆర్ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: త్వరలోనే సీఎం రేవంత్‌ని కలుస్తా: మల్లారెడ్డి ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల్ని కలుస్తున్న పరిణామాలు చూస్తున్నాం. దీంతో వాళ్లు పార్టీలు మారతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా.. ఆ పరిణామాల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేసీఆర్‌వీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపైనా ఆయన ముఖ్యనేతలతో చర్చించారు. ‘‘పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఇక నుంచి వారంలో రెండు రోజులు పార్టీ నేతలు, కార్యకర్తలను కలుస్తా. మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని కేసీఆర్ అన్నారు. -
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముందని.. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటూ స్పష్టం చేశారు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. చర్చకు తావులేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానన్నారాయన. ‘‘మేము ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదు. తాము ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి ఎంపీగా నన్నే పోటీ చేయమన్నారని నేను టికెట్‌ను నా కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నానని మల్లారెడ్డి అన్నారు. మరోవైపు, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు 71 ఏళ్లు వచ్చాయని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానన్న ఆయన.. రాజకీయ పరంగా తనకు ఇవే చివరి ఐదేళ్లు.. ఈ ఐదేళ్లలో మీ అందరికీ మంచిగా సేవ చేస్తానన్నారు. ఇదీ చదవండి: Sambasiva Rao: సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు -
KCR: ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంజర్‌లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. ఇక, కేసీఆర్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. అంతకుముందు, కేసీఆర్ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నారన్న వార్త నేపథ్యంలో బీఆర్ఎస్, కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో, అసెంబ్లీ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అనంతరం బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ pic.twitter.com/0QJDqd8ERD — Telugu Scribe (@TeluguScribe) February 1, 2024 Video Credit: Telugu scribe ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం, ఆపరేషన్ నిర్వహించడం, తదితర కారణాలతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. వైద్యుల సూచన మేరకు కేసీఆర్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. KCR sir entering into Telangana Legislative Assembly Jai Telangana pic.twitter.com/bCrtRwUfP7 — Krishank (@Krishank_BRS) February 1, 2024 -
TS: ముగిసిన సర్పంచ్ల పదవీకాలం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటితో సర్పంచ్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగునుంది. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. సర్పంచ్ల పదవీకాలంలో ముగిసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసిన గ్రామ సర్పంచ్‌లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో మీ పాత్ర ఎనలేనిది. మీరు మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు! ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసిన గ్రామ సర్పంచ్‌లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో,… pic.twitter.com/UnepmmXIp3 — KTR (@KTRBRS) February 1, 2024 -
అత్యధిక స్థానాలపై కమలం గురి
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా దక్షిణాదిలో పట్టు సాధించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది ఈ మేరకు హస్తిన వేదికగా రాష్ట్ర నాయకత్వంతో సమాలోచనలు జరుపుతోంది. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన వారు, ప్రజాదరణ ఉన్న నేతలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, సీనియర్ నేత ఈటల రాజేందర్లు బుధవారం ఢిల్లీలో జాతీయ నాయకత్వంతో భేటీ అయ్యారు. మరోవైపు కిషన్‌రెడ్డి పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై దాదాపు 40 నిమిషాలు చర్చించారు. కాగా ఆయా సమావేశాల్లో 17 లోక్‌సభ స్థానాల్లో పార్టీ బలాబలాలు, తాజా రాజకీయ పరిస్థితి, బలమైన నేతలు, ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్టు సమాచారం. నడ్డా దిశా నిర్దేశం మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలోనూ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన ప్రణాళికలపై అధ్యక్షుడు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ బలంగా ఉన్నందున, దక్షిణాదిలోనూ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలిచేందుకు సిద్ధం చేసిన రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రుల ప్రచార సభలు, రోడ్ షోలు తదితర ప్రచార కార్యక్రమాల షెడ్యూల్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ కుమార్‌లు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎ న్నికలపై ఏ విధంగా పడుతుందన్న అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు కేవ లం సీనియర్లు అనే కాకుండా యువత, మహిళలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను సైతం సీట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోవాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. -
నియామక పత్రాల పేరిట ఆర్భాటం
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచించిందని ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పిన రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎల్బీస్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్‌నర్స్‌ల భర్తీ నోటిఫికేషన్ ప్రకటించి, నియామక పత్రాలు ఇచ్చారా? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. సొమ్మొకడిది సోకు ఇంకొకడిది.. అన్నట్టు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్ వ్యవహరించిన తీరునే తప్పు బడుతున్నామన్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? ‘ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1న గ్రూప్–1 నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ ఏమైంది? రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు పెంపు, రూ.500 సిలిండర్, 4,000 నెలవారీ పింఛన్, మహాలక్ష్మి ద్వారా రూ.2,500 పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి హామీల లిస్ట్‌లో నేడు జాబ్ కేలెండర్ కూడా చేరింది’అని హరీశ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1.65 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 40 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై మీరు చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటే స్వాగతిస్తామన్నారు. -
పరువు నష్టం దావాపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్/ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ తనపై పరువు నష్టం కేసు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఆయన అయోమయంలో ఉన్నారని.. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరే ఠాకూర్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ‘‘మాణిక్యం ఠాగూర్ అయోమయంలో ఉన్నారు. ఆయనపై తోటి కాంగ్రెస్ నాయకుడు.. ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి మీకు(మాణిక్యం ఠాగూర్‌ను ఉద్దశిస్తూ..) రూ. 50 కోట్లతో పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పారు. అదే మాట మీకు మళ్లీ గుర్తు చేస్తున్నా. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన ఆ వార్తలనే నేను ప్రస్తావించా. పైగా కోమటిరెడ్డి చేసిన ఆ ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి కూడా తీసుకోలేదు.. వివరణా ఇవ్వలేదు. Manickam Garu, Why are you in a confused mode and misdirecting these notices? It was your colleague congressman & MP Venkat Reddy who had alleged on record that Revanth Reddy bribed you and bought the PCC president post for ₹50 Crore I had merely quoted the same since it was… https://t.co/YtK6EY9EIj pic.twitter.com/gickKF8Euy — KTR (@KTRBRS) January 31, 2024 .. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుంది. నా చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండి అంటూ ఎక్స్‌లో కేటీఆర్ సూచించారు. ఇదిలా ఉంటే.. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని మాణిక్యం ఠాగూర్ నోటీసులు పంపారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని.. వారంరోజుల్లోగా అదిర జరగకపోతే తదుపరి చట్టపరమైన చర్యలకు ముందుకెళ్తామని నోటీసుల్లో హెచ్చరించారాయన. -
టార్గెట్ లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ బీజెపీ అభ్యర్థుల జాబితా రెడీ?
సాక్షి, హైదరాబాద్: దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడీ నెలకొంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు రంగ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసినట్లు కనిపిస్తుంది. తెలంగాణ బీజెపీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం దీనిని.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపినట్లు సమాచారం. మేజార్టీ స్థానాలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. తొలిజాబితాలో ఎనిమిది నుంచి 10 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ఇరువై రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లను తిరిగి ఎంపీలుగా పోటీలో నిలపాలని నిర్ణయించింది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇక ఆదిలాబాద్‌లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం -
జనం గుండెల్లో జగన్.. కుమారిపై ప్రతిపక్షాల టార్గెట్ అందుకేనా?
శ్రీహరి నామ శబ్దాన్నే సహించలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని నానా హింసలూ పెడతాడు.. నీ శ్రీహరి ఎక్కడున్నాడు చెప్పు. అక్కడా...? ఇక్కడా ? ఎక్కడ ? అంటూ ఇబ్బంది పెడతాడు.. అప్పుడు బాలకుడు ప్రహ్లాదుడు పద్యం అందుకుంటూ ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు తండ్రీ.. ఎందెందు వెతికినా.. శ్రీహరి కనిపిస్తాడు అంటాడు.. అప్పుడు తండ్రి.. ధిక్కారమున్ సైతునా అంటూ ఏదీ ఈ స్తంభంలో చూపించు అని ఆ స్తంభాన్ని బద్దలుకొట్టగా అందులోంచి ప్రళయగర్జన చేస్తూ నరసింహస్వామి వస్తాడు.. అది వేరే.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది.. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులై ఉంది... దేశంలో ఏ చిటారుకొమ్మకు ఎగిరిపోయినా ఏ రాష్ట్రానికి మరలిపోయినా జగనన్న ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు.. తమ పట్ల ఆయన తీసుకున్న బాధ్యత... శ్రద్ధాసక్తులు సైతం ఆ వలస జీవులు తమతో మోసుకెళుతున్నారు. దానికి ఉదాహరణే.. హైదరాబాద్‌లో బతకడానికి వలసవెళ్లిన గుడివాడకు చెందిన కుమారి అనే మహిళా అక్కడ ఫుట్ పాత్ మీద చిన్న భోజన హోటల్ పెట్టుకుని నడుపుతోంది. ఇక్కడ తాము ఆర్జిస్తున్న ఆదాయం తమ కుటుంబానికి సరిపోకపోవడంతో భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లారు. అక్కడ ఆమె భర్త ఆటో నడుపుతుండగా ఆమె హోటల్ పెట్టి తక్కువ ఖర్చుతో పదిమందికీ భోజనం పెడుతోంది. ఆమె వండి వడ్డిస్తున్న తీరు.. మాటకారితనం.. అన్నీ కలిపి ఆమెను కొద్దిరోజుల్లోనే పాపులర్ చేసేశాయి.. దానికి తోడు యూట్యూబ్ చానెళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేయగా తనకు ఆంధ్రాలో జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చిందని, ఇల్లు ఇచ్చిందని సంతోషంగా చెప్పింది.. సరిగ్గా ఈ పాయింటును పట్టుకున్న ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తెలంగాణలోని తమ అనుకూల ప్రభుత్వంలోని పెద్దలను పురమాయించి రోడ్డు పక్కనున్న ఆమె హోటల్‌ను తొలగించారని వార్తలు వెల్లువెత్తాయి. కేవలం జగనన్న పేరు తల్చుకున్నంతనే ఆమె మీద టార్గెట్ చేసి హోటల్ తీయించేసారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. జగన్ అన్న పేరు తలచుకున్నవారిని చూసి కూడా ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని కొందరు అంటున్నారు. దేశ విదేశాలకు వెళ్ళిపోయినా వారు కూడా ఏదో విధంగా జగన్ ప్రభుత్వం ద్వారా లబ్దిపొందినవారేనని ఈ ఒక్క సంఘటన వెల్లడిస్తోంది. ఏ రాష్ట్రానికి వలసపోయినా వారికి స్వగ్రామంలో ఏదోవిధంగా ప్రయోజనం జగన్ ప్రభుత్వం కల్పించిందని... అందుకే వారంతా జీవిత పర్యంతం సీఎం జగన్‌ని తలచుకుని గుండెల్లో గుడికట్టుకుంటున్నారని చెప్పడానికి కుమారి ఉదంతమే ఒక ఉదాహరణ అంటున్నారు -సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: Pulivendula Politics : పులి ముందు ఫ్లూటా.? -
ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్ బాత్రూంలో జారి పడంతో ఆయన తుంటి విరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కేసీఆర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ఈ క్రమంలో అసంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. -
విభజన హామీల అమలుకు 17 గెలవాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకిచ్చిన విభజన హామీలు అమలు కావాలంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 17కు 17 స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలవాలని.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకోసం ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ ఎన్నికల కమిటీ (పీఈసీ) భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, పీఈసీ సభ్యులు షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, సంపత్‌కుమార్, శివసేనారెడ్డిలతో కలసి రేవంత్ విలేకరులతో మాట్లాడారు. పీఈసీ భేటీలో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు. కేసీఆర్ అడిగింది లేదు.. మోదీ ఇచ్చింది లేదు.. ‘విభజన హామీల్లో పొందుపర్చిన అంశాలను సాధించుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ గెలవాలి. దీనిపై పదేళ్లు కేసీఆర్ అడిగింది లేదు... మోదీ ఇచ్చింది లేదు’అని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల మేర అప్పులు చేస్తే ప్రధాని మోదీ రూ. 100 లక్షల కోట్ల అప్పులు తెచ్చి దేశాన్ని ప్రపంచంలోనే దివాలా తీసిన దేశంగా నిలబెట్టారని ఆరోపించారు. అందువల్ల రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ప్రధానిగా ఉండాల్సిన అవసరముందని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ చీకటి చర్చలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చీకట్లో మోదీతో జరుపుతున్న చర్చలను, బిల్లా–రంగాలు (కేటీఆర్, హరీశ్‌లను ఉద్దేశించి) మాట్లాడుతున్న మాటలను తెలంగాణ ప్రజలు గమనించి కాంగ్రెస్‌కు అండగా నిలవాలని రేవంత్ కోరారు. ‘అధికారం నుంచి దింపాల్సింది మోదీనైతే బిల్లా–రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ ఉండటమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే అధికారంలోకి వచ్చేది మోదీనే కదా? ఆ రెండు పార్టీలు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నారా?’అని ప్రశ్నించారు. కోదండరాంను అలాంటి వాళ్లతో పోలుస్తారా? ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణం చేస్తామంటే రాజకీయ కుట్రతో వాయిదా వేయించే ప్రయత్నం చేశారని రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల దొడ్లో చెప్పులు మోసేవాళ్లతో ప్రొఫెసర్ కోదండరాంను పోల్చడంలో అర్థముందా? అని నిలదీశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని, ఆ పార్టీని ప్రజలు బొందపెట్టారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కైనా అపాయింట్మెంట్ ఇస్తా.. తనను ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై సీఎం రేవంత్ స్పందించారు. ఎమ్మెల్యేలు ఎవరడిగినా సీఎంగా అపాయింట్మెంట్ ఇస్తానని, అవసరమైతే కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లు కూడా తనను అపాయింట్మెంట్ అడగొచ్చన్నారు. ఒకవేళ తాను ఆ సమయంలో అందుబాటులో లేకపోతే ఉపముఖ్యమంత్రిని కలవచ్చని చెప్పారు. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు బాధ్యత ఖర్గేకు.. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేంద్ర ఎన్నికల కమిటీకి బదిలీ చేస్తూ పీఈసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని రేవంత్ చెప్పారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి వచ్చి దరఖాస్తులపై చర్చించి కేంద్ర ఎన్నికల కమిటీకి ఇస్తుందని, ఈ నెల 15–20లోగా సమావేశాలు జరుగుతాయన్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకొనే అవకాశముందని చెప్పారు. కనీవిని ఎరగని రీతిలో ఇంద్రవెల్లి సభ ఫిబ్రవరి 2న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన టీపీసీసీ నేతల సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 2న కనీవినీ ఎరగని రీతిలో ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే ఈ బహిరంగసభపై మంగళవారం గాం«దీభవన్‌లో టీపీసీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఇంద్రవెల్లి స్తూపం వద్ద స్మృతి వనం కడతామని సీఎం చెప్పారన్నారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఇంద్రవెల్లి నుంచి ప్రచారం కార్యక్రమం మొదలైందని గుర్తు చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడు తూ ఇంద్రవెల్లిలో సీఎం పలు అభివృద్ధి కార్య క్రమాలు ప్రారంభిస్తారని వెల్లడించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నేతలు మోత్కుపల్లి నర్సింహులు, హరివర్ధన్‌రెడ్డి, శ్రీహరిరావు, డీసీసీ అధ్యక్షులు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. -
స్టాఫ్ నర్సులను భర్తీ చేసింది మేమే..
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సుల ఉద్యోగ భర్తీ ప్రక్రియను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట హడావుడి చేస్తున్నారని వైద్యఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రా లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం హరీశ్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ 1 నోటి ఫికేషన్‌ను ఫిబ్రవరి 1న ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్.. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి మరల్చేందుకే స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ పేరిట హడావుడి చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచి్చన హామీ ప్రకారం ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ వల్ల ఆటంకం వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది నియామకానికి తామే శ్రీకారం చుట్టామని హరీశ్‌రావు పేర్కొన్నారు. మొత్తంగా 7,094 స్టాఫ్‌నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించినా ఎన్నికల కోడ్ మూలంగా తుది ఫలితాల విడుదల జరగలేదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన నియామకాలను తమ ఘనతగా చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సు పోస్టులను ఉన్నతీకరిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసినా కాంగ్రెస్ నేటికీ పరిగణనలోకి తీసుకోవడం లేదని హరీశ్‌రావు ఆ ప్రకటనలో విమర్శించారు. -
బీఆర్ఎస్ చచ్చింది.. బీజేపీతోనే మా పోరు : సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల్లో తమ పోరు బీజేపీతోనే టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. బావ, బామ్మర్దులు ఇటీవల బీజేపీని పల్లెత్తుమాట అనకుండా కాంగ్రెస్‌ను విమర్శించడమే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననడానికి నిదర్శనమని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలపై మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘మోదీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 17 సీట్లు గెలవాల్సిందే. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు పరిష్కారం అవుతాయి. పదేళ్లలో విభజన హామీలను కేసీఆర్ అడగలేదు. మోదీ నెరవేర్చలేదు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం. భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదు. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించాం. మార్చి 3వ తేదీ వరకు ఎంపీ ఎన్నికలకు అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తాం. ఎన్నికల సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీకి గుజరాత్ నేత జిగ్నేష్ మెవానీ అధ్యక్షత వహిస్తారు. మార్చి 15 నుంచి 20 లోపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) లోక్‌సభ అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటుంది. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసే సభతో పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూర్తిస్తాం. రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం వాయిదా వేశారు. కోదండరాంను ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకునేందుకే కోర్టులో కేసులు వేశారు. కేసీఆర్‌కు కోదండరాం గొప్పతనం తెలియదు. ఎమ్మెల్యేలు ఎవరడిగినా అపాయింట్మెంట్ ఇస్తా. కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు లకు కూడా సమయం ఇస్తా. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీచేయాలని తీర్మానం చేసి పంపాం. సోనియాగాంధీ ఏకగ్రీవ ఎన్నికకు అందరూ సహకరిస్తామని ఆశిస్తున్నాం. బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు ఉంటాయి. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. ఇరిగేషన్‌పై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. ఇదీచదవండి.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం -
ప్రొ. కోదండరాం ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేకులు
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ.. కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని మంగళవారం తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల ప్రమాణం చేయడానికి వీల్లేదు!. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్. వీళ్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పటిషన్ విచారణ తేలెంత వరకు పిటిషన్ విచారణ ఆపాలంటూ కోరారు వాళ్లు. అయితే కోర్టు వాళ్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రమాణం చేయించవద్దని చెబుతూ.. ఫిబ్రవరి 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించింది. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరి పేర్లను ఆమోదించలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే గవర్నర్ తమ పేరును ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వారు పేర్కొన్నారు. వీరి పిటిషిన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ఈలోపే కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకు ప్రతిపాదించగా.. అందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతోనే రాజకీయ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. -
సూర్యాపేట: ఉద్రిక్తత.. మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై స్థానికులు దాడికి యత్నించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుందంటూ ఆరోపిస్తూ.. కవిత ఇంటి లోపల టెంటు వేసి నిరసన తెలిపేందుకు స్థానికులు యత్నించారు. దీంతో కవిత అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహంతో కవిత జుట్టు పట్టుకుని స్థానికులు దాడికి దిగారు. తమ స్థలాల్ని కబ్జా చేసిన కవితపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూమి తిరిగిచ్చేంత వరకు నిరసన తెలుపుతామని స్థానికులు అంటున్నారు. -
అవసరమైతే సిట్టింగ్‌లూ చేంజ్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠానికి దూరమైన భారత్ రాష్ట్ర సమితి త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని భావిస్తోంది. ఎన్నికల సన్నద్ధత, ప్రచారం తదితరాలపై దృష్టి సారిస్తూనే అభ్యర్తుల ఎంపిక పైనా కసరత్తు జరుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటూ కేవలం గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా బరిలోకి దింపాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అవసరమైన చోట సిట్టింగులను కూడా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు క్షేత్ర స్థాయిలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. 1న కేసీఆర్ అభిప్రాయ సేకరణ గత ఎన్నికల్లో 17 లోక్‌సభ స్థానాలకు గాను 9 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి మెజారిటీ సీట్ల సాధనపై కన్నేసిన బీఆర్ఎస్.. ఇప్పటికే రాష్ట్రంలోని లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ కేడర్‌తో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఫిబ్రవరిలో 10లోగా 119 అసెంబ్లీ నియోజవకర్గాల్లోనూ సన్నాహక సమావేశాలు పూర్తి చేయడంపై దృష్టి సారించింది. మరోవైపు కాలుజారి పడి ప్రస్తుతం కోలుకుంటున్న కేసీఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత పార్టీ కీలక నేతలతో ముఖాముఖి భేటీ జరపడంతో పాటు అభ్యర్థుల ఎంపికపైనా అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు. ఇప్పటికే చేవెళ్ల (రంజిత్‌రెడ్డి), జహీరాబాద్ (బీబీ పాటిల్), ఖమ్మం (నామా నాగేశ్వర్రావు) లోక్‌సభ స్థానాల నుంచి సిట్టింగ్ ఎంపీలకే మరోమారు టికెట్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ సంకేతాలు ఇచ్చింది. కరీంనగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజవర్గాలైన ఆదిలాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూలులో కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. కొన్నిచోట్ల ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పేర్లను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆశావహుల జాబితా పెద్దదే అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి, మెదక్ సహా విపక్షాల కంటే ఎక్కువ ఓట్లు సాధించిన ఏడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ కోసం ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీకి మొదటి నుంచి పట్టున్న మెదక్ టికెట్‌ను సుమారు అరడజను మంది ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ, మాజీ టీఎస్పీఎస్సీ సభ్యులు ఆర్.సత్యనారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ వెంకటరాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరిన గాలి అనిల్ కుమార్ కూడా టికెట్ అడుగుతున్నారు. మల్కాజిగిరిపై మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, విద్యా సంస్థల అధినేత నర్సింహారెడ్డి, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడెం నగేశ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేశ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఆరూరు రమేశ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, తొర్రూరు జెడ్పీటీసీ సభ్యుడు, మహబూబాబాద్ జెడ్పీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, మాజీ మంత్రి రెడ్యానాయక్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. నల్లగొండ నుంచి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్‌కర్నూలు నుంచి ఎంపీ రాములు లేదా ఆయన కుమారుడు భరత్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టికెట్ ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిని మార్చే పక్షంలో మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్లు పరిశీలించే అవకాశముంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు మోతె శోభన్‌రెడ్డి (డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత భర్త) పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ నుంచి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ యువజన విభాగం మాజీ ఉపాధ్యక్షుడు పట్నం కమలాకర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దరఖాస్తు అందజేశారు.