-
న్యాయవిచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..పర్యవేక్షణ లోపంతోనే రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి సుంకిశాల పంప్‌హౌస్ నీట మునిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆగస్టు 2న ఘటన జరిగినా అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయకుండా..రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెట్టిందన్నారు. సీఎంకు సమాచారం లేదంటే ఆయనకు పాలనపై పట్టు లేనట్టేనని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి తెలంగాణభవన్‌లో శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.పంప్‌హౌస్ నీట మునిగిన సమాచారం తెలియనంత మొద్దునిద్రలో ప్రభుత్వం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారుల ఒత్తిడితో హడావుడిగా గేట్లు, మోటార్లు బిగించడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. మున్సిపల్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్‌రెడ్డి వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, సీఎం పదవికి ఆయన అనర్హుడు అని విమర్శించారు. ‘చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టి కఠినచర్యలు తీసుకోవాలి. సుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి. త్వరలో రిటైర్డ్ ఇంజనీర్లు, పార్టీ నాయకులతో కలసి సుంకిశాలను సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం’ అని కేటీఆర్ ప్రకటించారు.వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు‘గతంలో మేడిగడ్డ కుంగుబాటు ఘటన జరిగిన వెంటనే కాంట్రాక్టు సంస్థ ఎల్‌అండ్‌టీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి న ఘటనపై తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు మంత్రులు బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మా మీద బట్టకాల్చి మీద వేస్తే సహించేది లేదు.ప్రాజెక్టు డిజైన్ కాదు.. భట్టి ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది. గతంలో మేడిగడ్డపై హడావుడి చేసిన ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఎందుకు రాలేదు. దీనిపై బీజేపీ నాయకులు, కేంద్ర సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. పంప్‌హౌస్ మునకతో కోట్లాది రూపాయల సంపద నీటి పాలైంది. హైదరాబాద్ మహానగర ప్రజలకు తీరని నష్టం వాటిల్లింది. నీళ్ల విషయంలో కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ బురదచల్లే ప్రయత్నాలు చేస్తోంది’ అని కేటీఆర్ విమర్శించారు. -
గుమ్మడికాయ దొంగ మాదిరే కేటీఆర్ తీరు
సాక్షి, హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా మాజీ మంత్రి కేటీ రామారావు తీరుందని మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. గతంలో కేటీఆర్ అమెరికా పర్యటన ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో పెట్టుబడులు అంటూ వివిధ కంపెనీలతో చేసుకున్న ఎంవోయూలన్నీ కూడా బోగస్సేనని ఆరోపించారు.శుక్రవారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగో లుగా లక్షల కోట్లు దోచుకుందని, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళితబంధు, మిషన్ భగీ రథ అన్నీ కుంభ కోణాలేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన సాగుతోందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పనిగట్టుకుని రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. -
గతంలో కేటీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా?: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆధారాలు చూపించి మాట్లాడితే మంచిది అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్ గతంలో అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుంది. పెట్టుబడులు రావాలి.. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అని సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా?. పనికి రానీ మాటలు మాట్లాడుతున్నారు. బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారు.గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఎంవోయూలు చేసుకున్న కంపెనీలు అన్ని బోగస్ కంపెనీలే. ధాత్రి బయో సిలికాన్ కూడా బోగస్ కంపెనీనే. వాణిజ్య ఒప్పందాల మేరకు అవకతవకలు చేశారనే దానికి నిదర్శనం ఈ ఒప్పందాలు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని స్కామ్‌లే. లక్షల కోట్లు దోచుకున్నారు. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని బాగుచేయాలని పనిచేస్తున్నారు. కేటీఆర్ ఇలా మాట్లాడితే ఎలా?. రుజువులతో మాట్లాడితే మంచిది.. అడ్డగోలుగా మాట్లాడ్డం మంచిది కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సుంకిశాలపై మాటల యుద్దం.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్
సాక్షి, ఖమ్మం: సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు కూలిపోతే మా ప్రభుత్వానికి ఎలా బాధ్యత అవుతుందని భట్టి ప్రశ్నించారు.కాగా, తాజాగా భట్టి విక్రమార్క ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం, సుంకిశాల కట్టింది బీఆర్ఎస్ పార్టీనే. ప్రాజెక్ట్‌లు మీరే కట్టారు కాబట్టి.. అవి కూలితే మీదే బాధ్యత. మా ప్రభుత్వంలో కట్టడాలపై మాది బాధ్యత అవుతుంది. సాగర్‌లోకి నీళ్లు రాకుండా ఉంటాయా?. మేము ఎందుకు దాచిపెడతాము. మేడిగడ్డ కరెక్ట్ కాదిన మేము ముందే చెప్పాం. మీరు కట్టిన ప్రాజెక్ట్‌లు క్వాలిటీ లేకుండా అవినీతితో కట్టారు. రాష్ట్రంలో మిగతా ప్రాజెక్ట్‌లు కూడా చెక్ చేయాల్సి అవసరం ఉంది. ప్రాజెక్ట్‌ల విషయంలో జరిగిన తప్పులను కేటీఆర్, బీఆర్ఎస్ ఒప్పుకుని ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రాజెక్ట్‌లో ఇంజినీర్లు చేయాల్సిన పని మీరు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.ఇక, సుంకిశాల విషయంలో అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
కవిత బయటకు వస్తుంది.. వచ్చే వారంలో బెయిల్: కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని చెప్పుకొచ్చారు ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో కవిత ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.కాగా, కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ.. తీహార్ జైలులో ఉన్న కవిత ఆరోగ్యం క్షీణించింది. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీల బరువు తగ్గింది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతోంది. వచ్చే వారంలో బెయిల్‌కు వస్తుంది అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కవితకు బీజేపీ బెయిల్ ఇప్పిస్తుందనే వార్తలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఇక, లిక్కర్ స్కాం కేసులో కవితకు ఇప్పటికే కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది. -
‘సుంకిశాల’ ప్రాజెక్టు ఘటన ఎందుకు దాచారు?: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేటీఆర్ అన్నారు. శుక్రవారం(ఆగస్టు9) తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. మునిసిపల్ శాఖ తనవద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డలో ఏమైనా జరిగితే కేంద్రం స్పందిస్తుందని, ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని కేటీఆర్ నిలదీశారు. మేడిగడ్డ ఘటను ఎన్నికలున్నప్పటికీ తాము దాచలేదని గుర్తు చేశారు. రాజధాని హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని విమర్శించారు. ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానివి దివాళాకోరు విధానాలని, చిల్లర విమర్శలని ఫైర్ అయ్యారు. ‘రాష్ట్ర ప్రజల కోట్లాది రూపాయల సంపద నీట మునిగింది. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయాలని వేగంగా పనులు చేశాం. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభించలేదు. నెత్తిమీద నీళ్ళు జల్లుకొని భట్టి, తుమ్మల యాక్టింగ్ చేస్తుండవచ్చు’అని కేటీఆర్ చురకంటించారు. -
ఆత్మవంచన బీఆర్ఎస్ నైజం
సాక్షి, హైదరాబాద్: ‘మాజీ ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావుకు పెండింగ్ బిల్లుల బాగోతం తెలుసు. అయినప్పటికీ పదేపదే వాస్తవాలను వక్రీకరించడం అంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది’ అని మంత్రి సీతక్క పేర్కొ న్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో సర్పంచులతో బలవంతంగా పనులు చేయించారు.. వందలకోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన సర్పంచులను పాడెనెక్కించింది మీరే’ అంటూ ఆమె ధ్వజమెత్తారు. ‘గ్రామ పంచాయతీల సమస్యలపై మీరు మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే.గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపి ఇప్పుడు నీతి సూక్తులు వల్లిస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, పీఆర్ మంత్రిగా తనపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలపై ఆయా అంశాల వారీగా మంత్రి సీతక్క గురువారం ఓ ప్రకటనలో బదులిచ్చారు. పంచాయతీల బాగుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో ఏళ్లుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో గ్రామపంచాయతీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.‘పంచాయతీలకు మేము ఏం చేశామో ప్రజలకు తెలుసు. 15వ ఫైనాన్స్ కమిషన్‌కి సంబంధించి రూ.431.32 కోట్ల నిధులు విడుదల చేశాం. దీనికి అదనంగా రూ.323.99 కోట్ల సీఆర్డీ నిధులిచ్చాం. అయినా 9 నెలల్లో 9 పైసలు కూడా విడుదల చేయలేదని అనడం విడ్డూరంగా ఉంది’ అంటూ హరీశ్‌రావుపై సీతక్క ధ్వజమెత్తారు. -
కమలానికి కొత్త సారథి.. ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకపు అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర పార్టీలో సమన్వయ లేమి సమస్య, ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం, కేడర్‌లో నిరాసక్తత, నిస్తేజం పెరుగుతున్న నేపథ్యంలో... కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ఇంకా ఎప్పుడు నియమిస్తుందా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవితో పాటు, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన రాష్ట్ర పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించ లేకపోతున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. కిషన్‌రెడ్డి కూడా వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తప్పించాలని అధిష్టానానికి ఇప్పటికే విన్నవించినట్టు సమాచారం. దీంతో పాటు మరో మూడు నాలుగు నెలల్లో స్థానికసంస్థల ఎన్నికలు జరగొచ్చుననే రాజకీయవర్గాల అంచనాల నేపథ్యంలో గ్రామ, మండల ,జిల్లా స్థాయిల్లో పార్టీ పటిష్టతతో పాటు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచుకోవడమనేది బీజేపీకి తక్షణ అవసరంగా మారింది.స్థానిక ఎన్నికల్లో... జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అంతగా కేడర్, స్థానిక నాయకుల బలం లేని బీజేపీ.. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఎదుర్కొని గణనీయమైన సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎలా గెలిపించుకోగలుగుతుందనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నేతను కొత్త అధ్యక్షుడిని నియమిస్తే...ఎన్నికల్లోగా సంస్థాగతంగా పార్టీ బలం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.ఈటల వైపే మొగ్గు...?బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం..పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గట్టిగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, టి.రాజాసింగ్, ముఖ్యనేతలు ఎన్.రామచంద్రరావు, చింతల రామచంద్రా రెడ్డి, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు పోటీపడుతున్నారు.బీజేఎల్పీ నేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచ్చినందున, రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందినవారినే అధిష్టానం నియమిస్తుందని పార్టీలో పలువురు నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ వాదన రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన ఈటల రాజేందర్‌కు అడ్వాంటేజ్‌గా మారొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల వైపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ బన్సల్ వంటి వారు మొగ్గుచూపుతున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బీసీ వర్గాల నుంచే ఎంపికచేస్తే ఈటలతో పాటు అర్వింద్ ధర్మపురి, పాయల్‌శంకర్, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు పేర్లను సైతం పరిశీలిస్తారని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితమే పార్టీలో చేరిన ఈటలకు అధ్యక్ష పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచాక కొత్త, పాత అంటూ ఉండదని, రాష్ట్రంలో పార్టీ గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా విస్తరించి, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇది అడ్డంకి కాకూదని వాదిస్తున్న వారూ పార్టీలో ఉన్నారు.అలాగైతే రామచంద్రరావుకే.. సైద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యతని స్తే... మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని పార్టీ వర్గాలంటున్నాయి. కొత్త వారికి అధ్యక్ష పదవి వద్దన్న కొందరి అభ్యంతరాల నేపథ్యంలో సంఘ్ పరివార్ కూడా మద్దతిస్తే రామచంద్రరావుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని పార్టీ నాయకులు కోరుతున్నారు. మొత్తంగా చూస్తే పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. -
సుంకిశాల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే: భట్టి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు అదేశించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఆయన గురువారం మింట్ కాంపౌండ్‌లో మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరాపై దిశానిర్దేశం చేశాము. ఎస్పీడీసీఎల్లో అంతర్గత బదిలీలు, ప్రమోషన్లపై కూడా ఆదేశాలు జారి చేశాం. విద్యుత్ సరఫరాకు ఏదైనా ఇబ్బంది అయితే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ప్రజల కోసమే నిరంతరం ఎస్పీడీసీఎల్ పనిచేస్తోంది అని మర్చిపోవద్దు’’ అని అన్నారు.సుంకిశాలపై తప్పడు ప్రచారం.. సుంకిశాలపై వార్తల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని భట్టి విక్రమార్క్ అన్నారు. ‘మేడిగడ్డ గోదావరి నదిపై మాత్రమే కాదు.. కృష్ణానదిని కూడా గత ప్రభుత్వం వదిలిపెట్టలేదు. సుంకిశాల నిర్మాణం బీఆర్ఎస్ హయంలోనే నిర్మాణం జరిగింది. డిజైన్ లోపం వల్ల సుంకిశాల కూలింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సుంకిశాల కట్టింది మేము కాదు.. గత ప్రభుత్వం కట్టిందే. గోదావరి మెడిగడ్డతో పాటు సుంకుశాల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. 2021లో మొదలు 2023 జులైలో సుంకిశాలను గత ప్రభుత్వం ప్రారంభించింది. గత ప్రభుత్వ పాపాలను మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. పాపాలను భరించలేక ఇప్పటికే ప్రజలు గత ప్రభుత్వనికి బుద్ధి చెప్పారు’ అని అన్నారు. -
ఉన్నమాట అంటే ఉలికిపాటు ఎందుకు సీతక్క?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని తాము చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తాము పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క గారు అంటున్నారని మండిపడ్డారు. ఈమేరకు గురువారం హరీష్ రావు మాట్లాడుతూ..ఏది అబద్ధం ?ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది అబద్దమా?కేంద్రం నుంచి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన 2100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్ళించింది అబద్దమా?15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్దమా?మాజీ సర్పంచ్‌లు పెండింగ్ బిల్లుల కోసం ఛలో సచివాలయం పిలుపు నిస్తే వారిని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది అబద్దమా?గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం అటకెక్కడం మేం చెప్పిన అబద్దమా?గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ రోగాలు ప్రబలడం అబద్ధమా?రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించకపోవడం అబద్ధమా?8 నెలలుగా జడ్సీటీసీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం అబద్ధమా?బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలకు నెలనెల 275 కోట్లు, సంవత్సరానికి 3,300 కోట్ల నిధులు విడుదల చేసింది నిజం కాదా?ఈ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదు.ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నది పచ్చి నిజం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నాను’ అని తెలపారు. -
సీఎం రేవంత్ అమెరికా పర్యటన వ్యక్తిగతం కాదు: మంత్రి పొన్నం
సాక్షి, హన్మకొండ: తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా బీఆర్ఎస్ నేతలకు కళ్లు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. అన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామని కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండలోని భీమదేవరపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వ్యక్తిగతం కాదు. అది ప్రభుత్వ అధికారిక పర్యటన మాత్రమే. బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ బాగుపడుతుందోనని అసూయతో ఆరోపణలు చేస్తున్నారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లాడుతున్నారు. సుంకేసుల నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయి. ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశిస్తున్నాం. మీరు విచారణకు సిద్ధమా?. మసి పూసి బట్టకాల్చి మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సుంకేసుల ఘటనపై సమగ్రమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక పరమైన నివేదికలతో మీ ముందుకు వస్తాం. ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం.పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత వారి అసహనానికి హద్దు లేకుండా పోయింది. ప్రజా సమస్యలపై మాట్లాడాలని జ్ఞానం లేకుండా ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దోషులను కచ్చితంగా శిక్షిస్తాం. బరాబర్ జవాడు చెబుతాం. బీఆర్ఎస్, బీజేపీ వేరువేరు కాదు. ప్రజలు మిమ్మల్ని వేరువేరుగా చూడటం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఎవరికీ తలవంచేది లేదు!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పడినా లేచినా తెలంగాణ కోసమే తమ పోరాటం కొనసాగుతుందని.. ఎన్నటికీ, ఎవరికీ తలవంచేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ విలీనం, పొత్తులు అంటూ వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్పై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పలు పోస్టులు చేశారు. ‘‘24 ఏళ్లుగా ఇలాంటి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను మా పార్టీ ఎదుర్కొంది. ఇవన్నీ దాటుకొని నిబద్ధత, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణను సాధించింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టాం. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాం. ఎప్పటిలాగానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పారీ్టపై అడ్డగోలు అసత్యాలు, దుష్ప్రచారాలు మానుకోవాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. దగాపడ్డ చేనేత రంగాన్ని బాగుచేశాం దశాబ్దాల పాటు దగాపడిన చేనేత రంగాన్ని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో స్వర్ణయుగాన్ని తలపించేలా తీర్చిదిద్దామని కేటీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆరేళ్లలో చేనేత రంగానికి రూ.600 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే.. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి రూ.1,200 కోట్లు వెచ్చించామని తెలిపారు. కేసీఆర్ పాలనలోనే నేత కార్మీకులకు గుర్తింపు, గౌరవం దక్కిందన్నారు. ‘‘చేనేత మిత్ర, నేతన్నకు బీమా, 36 వేల నేత కుటుంబాలకు సాయం, 10,150 మంది నేత కార్మికులకు రూ.29 కోట్ల రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. బతుకమ్మ చీరలతో సంక్షోభంలో ఉన్న నేత రంగాన్ని గట్టెక్కించాం. సిరిసిల్లలో అపెరల్ పార్క్, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశాం..’’ అని కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పాలనలో నేత కార్మీకుల జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఆరోపించారు. నేత వ్రస్తాలపై జీఎస్టీ విధింపుతో పాటు ఆలిండియా హ్యాండ్లూమ్, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్సŠ, ఆలిండియా పవర్ లూమ్ బోర్డులు, చేనేత కార్మీకుల త్రిఫ్ట్ పథకం, హౌస్ కం వర్క్ షెడ్ పథకాలు, మహాత్మాగాంధీ బనకర్ బీమా పథకాలను కేంద్రం రద్దు చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
మీరు ఊళ్లు పాడు చేస్తే.. మేం బాగు చేస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గత పదేళ్లలో గ్రామ పంచాయతీలకు నాటి ప్రభుత్వం రూ.10,170 కోట్లను కేటాయించినా కేవలం రూ.5,988 కోట్లనే విడుదల చేసిందని, చివరికి ఆ 44 శాతం నిధులను కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకుందని ఆమె ఆరోపించారు. అలాంటి బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు మాట్లాడే హ క్కు ఎక్కడిదని సీతక్క నిలదీశారు.స్వచ్ఛదనం– పచ్చదనం కార్యక్రమంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సొంత ఆదాయంలో స్థానిక ప్రభుత్వాలకు 11 శాతం నిధులు కేటాయించాలని..అందులో నుంచి 61 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయించాలని ఆరి్ధక సంఘం సిఫార్సు చేస్తే...గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గుర్తు చేశారు.అప్పుడే వాటా ప్రకారం పంచాయతీలకు నిధులు ఇస్తే ఇప్పుడు సమస్యలు ఉండకపోయేవని పేర్కొన్నారు. ఇలా ఎన్నో రకాలుగా పంచాయతీలను గత ప్రభుత్వం పాడు చేయగా, ఇప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని సీతక్క వివరించారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో కనీసం పాల్గొనకుండా ఫక్తు రాజకీయాలు చేయడం హరీశ్‌రావు మానుకోవాలని సూచించారు.3 రోజుల్లో...25 లక్షల మొక్కలు రాష్ట్రంలో గత మూడురోజులుగా ’స్వచ్ఛదనం–పచ్చదనం’కొనసాగుతోంది. మంత్రులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ వర్గాల ప్రజలు, కలెక్టర్ల నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు అధికారులు ఉత్సాహంగా స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొంటున్నారు. సోమవారం స్వచ్ఛదనం – పచ్చదనం ప్రారంభం కాగా... బుధవారం సాయంత్రం వరకు 25.55 లక్షల మొక్కలను నాటారు. 29,102 కిలోమీటర్ల మేర రహదారులను శుభ్రపరిచారు. 18,599 కిలోమీటర్ల మేర డ్రైనేజీలను శుద్ధి చేశారు. 50 వేల ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. నీళ్లు నిలవకుండా 11,876 లోతట్టు ప్రాంతాలను గుర్తించి చదును చేశారు. బుధవారం ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఆధారాలుంటే చూపండి.. నిరూపించండి
సాక్షి, హైదరాబాద్: మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనలో తన ప్రమేయం ఉన్నట్లు ఏ ఆధారాలు ఉన్నా చూపాలని, వాటిని నిరూపించాలంటూ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. ఆ ఘటనతో తనకే మాత్రం సంబంధం లేదని, సీబీఐ సహా ఎవరితో దర్యాప్తు జరిపినా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇదంతా చంద్రబాబు కుట్రే అని చెప్పారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయాల్లోకి వచి్చన నాటి నుంచి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని గుర్తు చేశారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన్ని ఎదుర్కొంటున్నందునే తనను టార్గెట్ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తానెలాంటి తప్పు చేయకపోయినా, కుట్రలతో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. వారి అనుకూల పత్రికల్లో తనపై దు్రష్పచారం చేసి, వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం నుంచి మంత్రుల వరకు ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతున్నారని, ఏ ఆధారాల్లేకపోయినా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచి్చన హామీలను అమలు చేయలేక, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఏమన్నా అంటే ఖజానా ఖాళీ అంటున్నారని, సూపర్ సిక్స్ గురించి కూడా బాబు మాట్లాడటంలేదంటూ దెప్పిపొడిచారు. నాపేరు చెప్పించే కుట్ర మదనపల్లెలో తగలబడ్డాయని చెబుతున్న రికార్డులు ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీస్‌తో పాటు సచివాలయంలో కూడా ఉంటాయని చెప్పారు. ఆ రికార్డులన్నింటి డేటా రిట్రీవ్ చేశామని చెబుతున్నారని, ఇక ఆ ఘటనలో కుట్ర కోణం ఏముందని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను వేధిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వారితో తన పేరు చెప్పించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాతా చాలా మందిని హత్య చేశారని, చాలా మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయని, ఆ కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం ఇంత వేగంగా ఎందుకు స్పందించడంలేదని ప్రశి్నంచారు. మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరగ్గానే ఏదో పెద్ద విపత్తు సంభవించినట్లు ఏకంగా డీజీపీని హెలికాప్టర్లో పంపారని గుర్తు చేశారు. -
ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీన అంటే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పషం చేశారు.కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 15వ తేదీన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు వైరాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
మెడికల్ సీట్లపై హరీశ్ రావు ఆగ్రహం.. ప్రభుత్వానికి ప్రణాళిక లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదని మండిపడ్డారు. ఆయన బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘‘ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రణాళిక లేదని మెడికల్ సీట్ల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా పరిగణించేలా కుట్రలు జరుగుతున్నాయి. 2018 లో బీఆర్ఎస్ ప్రభుత్వం 114 జీవో ఇచ్చి 95 శాతం ఉద్యోగాలన్ని తెలంగాణకే దక్కే విధంగా ఉత్తర్వులు ఇచ్చాము. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఈ పదేళ్లు ఏపీలోని విద్యార్థులు 15 శాతం ఇక్కడ చదువుకోవచ్చని చెప్పింది. .. డాక్టర్లు కావాలని పిల్లల తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ వారి కలలు కల్లల్లుగా మారే పరిస్తితికి వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెడికల్ సీట్ల సంఖ్య పెంచాము. జీవో సవరించి 520 సీట్లు పెరిగేలా మేము కృషి చేశాం. బీ కేటగిరి సీట్లలో కూడా లోకల్ రిజర్వేషన్లు ఉండేలా తెలంగాణ పిల్లలకు దక్కేలా చేశాం. ఆదరాబాదరాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం, నష్టం జరిగేలా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ‘స్వచ్ఛదనం పచ్చదనం’ అని అయిదు రోజుల కార్యక్రమం ప్రారంభించింది. ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదు. గ్రామాల్లో సమస్యలు గుర్తించి చెప్పాలని అంటున్నారు. క్లీనింగ్ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లాలని చెప్పింది మరీ డబ్బులు ఎక్కడివి. సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల దగ్గర డబ్బే లేదు. డీజిల్ లేక ట్రాక్టర్లు ఆగిపోయాయి. గ్రామ పంచాయతీలో కరెంట్ బిల్లులు పేరుకుపోయాయి. సిబ్బందికి జీతాలు లేవు. మరి ఎక్కడి నుంచి ‘స్వచ్ఛదనం పచ్చదనం’ ఎలా చేస్తారు. ఇవాల్టికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గ్రామ పంచాయతీలకు 8పైసలైన ఇచ్చారా? ఆసుపత్రుల్లో మందులు లేవు’ అని అన్నారు.అని మండిపడ్డారు. -
బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం.. వారికి కేటీఆర్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కేటీఆర్ సీరియర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.బీఆర్ఎస్ పార్టీపైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలి. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. 24 Years of Resilience and Devotion! Against Hundreds of Saboteurs,Standing up Against Thousands of Malicious Propagandists & Schemes!For 24 Years!And yet, we prevailed. We fought tirelessly, and we achieved and built a state that has become a beacon of progress and pride. A…— KTR (@KTRBRS) August 7, 2024కొట్లాది సాధించుకున్న తెలంగాణను సగర్వంగా నిలబెట్టుకుని, అభివృద్ధిలో అగ్ర భాగంలో నిలిపాం. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఎప్పటి లాగానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలను మానుకోవాలి. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం.. కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు. -
ప్రజలిచ్చిన తీర్పును సవాలుగా తీసుకోవాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘ఆగస్టు 15న తెలంగాణలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు. రుణమాఫీపై రైతులకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశాం. దానికి రోజు వేల సంఖ్యలో రైతులు కాల్స్ చేస్తున్నారు. రుణమాఫీ కాలేదని.. ఎవరు సహాయం చేయట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేస్తున్నారో అర్థం కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్స్ మాట్లాడటానికి మొదట్లో ఒక్కరినీ పెట్టాం.. పెరిగిన కాల్స్ చూసి ఇప్పుడు ఆరుగురిని పెట్టినా సరిపోట్లేదు. ప్రజలు బీజేపీపై ఆశతో తెలంగాణలో 36 శాతం ఓటు షేర్ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేద్దాం’అని అన్నారు. -
ప్రజాప్రతినిధులకు రోజూ అవమానాలేనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పట్ల ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో ప్రతినిధులకు ప్రతిరోజు అవమానాలేనా? ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పైన గద్వాల జిల్లా యంత్రాంగం వ్యవహరించిన అనుచిత తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేతిలో తిరస్కరించబడిన కాంగ్రెస్ నాయకులను అధికారిక సమావేశాలు, కార్యక్రమాల్లో ఎందుకు ఆహ్వానిస్తున్నారో? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ విధానాలను ఏమైనా మార్చిందా? ’అని కేటీఆర్ నిలదీశారు.Praja Palana where our public representatives are humiliated every dayI condemn the atrocious conduct of District officials who have insulted our MLA, Alampur Vijayudu Garu@TelanganaCS What is the reason for insisting on inviting the Congress party leaders who’ve been… https://t.co/p490wZePDl— KTR (@KTRBRS) August 6, 2024తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలపై వివాదం మంగళవారం వివాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్టు మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు. మోటార్లు ఆన్‌చేసి మూడు గంటలైనా నీళ్లు రాకపోవడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. తుమ్మిళ్ల నుంచి విజయుడు వెళ్లిన కొంత సమయానికి అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంప్‌లను ఆఫ్ చేశారు. దీంతో ఆర్డీఎస్ కాలువకు నీరు నిలిచిపోయిందని ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రైతులతో కలిసి తుమ్మిళ్లకు లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద రోడ్డుపై భైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తిత పరిస్థితి చోటుచేసుకుంది. -
‘గద్వాల ఎమ్మెల్యేకు ప్రాణ హాని’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కోరుట్ల: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ప్రాణహాని ఉన్నట్లు తెలుస్తోందని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం కోరుట్లలో తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘బీఆర్ఎస్లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దగ్గరికి ప్రభుత్వ పెద్దలందరూ వెళ్లి బెదిరింపులకు గురి చేశారు. నేను అయితే నా తల తీసివేసినా పార్టీ మారను. అభివృద్ధి కోసం పార్టీ మారవలసిన అవసరం లేదు. కోరుట్ల ప్రజలకు అవసరమైన 100 పడకల హాస్పిటల్ సహా ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. కేవలం తన స్వార్థం కోసమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తప్పుడు నివేదికలు చదివి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూశారు’అని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో కొనసాగుతారని వార్తలు వచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు నేతలను కలవటం తీవ్ర చర్చనీయంగా మారింది. ఆయన మనసు మార్చుకొని బీఆర్ఎస్లోనే కొనసాగుతారని వార్తలు వచ్చాయి. అనంతం కాంగ్రెస్ నేతలు రంగంలోకి ఆయన్ను బుజ్జగించిన విషయం తెలిసిందే. -
తప్పక వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నాం: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ సరైన పద్దతిని పాటించలేదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. పార్టీ మారుతున్న వారిని ఆపే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నేతలను చూస్తుంటే నవ్వు వస్తోందని సెటైరికల్ కామెంట్స్ చేశారు.కాగా, అద్దంకి దయాకర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్లో తమ నేతలను కాపాడుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులను తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటోంది. దీంతో, వారిని ఆపే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నేతలను చూస్తుంటే నవ్వు వస్తోంది. రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్దతిని పాటించలేదు. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి.పార్టీ ఫిరాయింపులు అనేవి కేవలం తెలంగాణలోనే జరగడం లేదు. దేశ రాజకీయాల్లో ఒక తంతుగా మారింది. టీడీఎల్పీని, సీఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నప్పుడు వారిని సిగ్గుగా అనిపించలేదా?. అప్పుడు కేటీఆర్‌కు చట్టం, న్యాయం ఎందుకు కనిపించలేదు. రాజకీయాల్లో బీఆర్ఎస్కు ఒక న్యాయం. ఇతరులకు మరో న్యాయమా?. చట్టపరమైన అంశాలను కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కోగలదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ కొనసాగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లపై అర్హనత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు.వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా. ప్రతివాదుల తరఫున వాదనలు వినిపించారు జంధ్యాల రవిశంకర్. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హతపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించాము. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ : తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు..పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా బీఆర్ఎస్ పార్టీ తరుఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై న్యాయనిపుణులతో మాట్లాడేందుకు కేటీఆర్‌తో పాటు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణలతో,రాజ్యాంగ నిపుణులతో ఇవాళ సాయంత్రం (ఆగస్ట్ 5న)భేటీ కానున్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నాం. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. -
సమన్వయలేమి, స్తబ్దత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో స్తబ్దత నెలకొంది. గత ఎనిమిది నెలలుగా పార్టీలో జోష్ లోపించింది. ఇప్పటికే ముఖ్యనేతల మధ్య సమన్వయలేమి కొనసాగుతుండగా దీనికితోడు పార్టీ విస్తరణ, పటిష్టత కోసం ఎవరూ చురుగ్గా వ్యవహరించడంలేదంటూ కేడర్‌లో నిరాసక్తత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎనిమిది మంది చొప్పున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారని పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు.ఇటీవలి కేంద్ర బడ్జెట్లో పార్టీ ఎంపీలు తెలంగాణకు జాతీయ ఏదైనా ప్రాజెక్టు లేదా ప్రత్యేక నిధులు సాధించడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే అంతర్గత సమావేశాల్లో విమర్శిస్తున్నారు. దీంతో పార్టీ రాష్ట్ర శాఖకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా అనే సందేహం పార్టీ వర్గాల్లో నెలకొంది. సొంత ఇమేజీ పెంచుకోవడంపైనే... ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సొంత ఇమేజీని పెంచుకోవడంపైనే అధిక దృష్టి పెడుతున్నారన్న విమర్శలు కూడా అంతర్గతంగా పారీ్టలో వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం వారికి సరిగ్గా దిశానిర్దేశం చేయలేకపోవడానికి గల కారణాలు ఏమిటనే చర్చ కూడా కేడర్‌లో నడుస్తోంది. ప్రధానంగా సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తీర్పును బీజేపీ అనుకూలంగా మలుచుకోలేకపోవడంపైనా సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని.. బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఎమ్మెల్యేలను సైతం ముఖ్యనేతలు ఆదేశించడంతో రాష్ట్ర పార్టీ నుంచి ఎవరూ స్పందించని పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయంపై కనీసం ఎమ్మార్పీఎస్ ద్వారానైనా సంబరాలు చేయించి ప్రధాని మోదీకి, బీజేపీకి క్రెడిట్ దక్కేలా చేయలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ తూతూమంత్రంగా అమలు చేస్తోందని విమర్శించిన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి... పార్టీ రాష్ట్రకార్యాలయంలో దీనిపై హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్ర చేశారు. అయితే ఒకవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి స్పష్టమైన సూచనలు లేకపోవడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుణమాఫీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది పార్టీ రాష్ట్రశాఖకు, బీజేఎలీ్పకి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయలోపాన్ని బయటపెట్టింది. క్రియాశీలం కాని పార్టీ వ్యవస్థ... బీజేపీ రాష్ట్ర శాఖకు మొత్తం ఐదుగురు ప్రధాన కార్యదర్శులు (సంస్థాగత బాధ్యతలు కలిపి), పెద్ద సంఖ్యలో కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ఇతర వ్యవస్థ ఉంది. అయితే వారంతా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ, విభాగాల మధ్య సమన్వయం, కార్యాచరణ ప్రణాళిక తదితరాలపై అంటీముట్టనట్టుగా, మొక్కుబడిగా పనిచేస్తున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ఎలా సిద్ధమవుతుందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని ఎలా నెరవేరుస్తుందన్న అనుమానాలు కేడర్‌లో వ్యక్తమవుతున్నాయి. -
ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా
సాక్షి, రంగారెడ్డి జిల్లా/బడంగ్పేట్: కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలు ముందుగానే సేకరించి..రియల్ దందా చేస్తూ వేలకోట్ల విలువ చేసే ఆస్తులు పోగేసుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తున్నారని చెప్పారు. ఈ ఫోర్త్‌సిటీ వల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని, స్థానిక నేతకే భూములు సేకరించే బాధ్యతను అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ కమిటీ నివేదిక ఎక్కడ? ధరణి పేరును భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూ మేతకు ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతుందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 24 లక్షల అసైన్డ్ భూములుంటే.. నేడు ఆ భూములు ఐదు లక్షలకు ఎలా తగ్గాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పెద్ధఎత్తున ధరణిని అడ్డుపెట్టుకొని దోచుకున్నారని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదన్నారు.అధికారంలోకి రాగానే ధరణిపై ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే భవిష్యత్‌లో గజం భూమి కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆ విలీన ప్రతిపాదన అర్థం లేనిది గ్రేటర్ హైదరాబాద్ శివారులోని 33 గ్రామపంచాయతీలు, 20 పురపాలక సంఘాలు, 8 కార్పొరేషన్లు, 61 పారిశ్రామిక వాడలు, కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదన అర్థం లేనిదని బండి సంజయ్ అన్నారు. దీనిపై బీజేపీ నాయకత్వం చర్చించి తగిన కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పారు. రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ప్రజల దృష్టిని మళ్లించడం కాంగ్రెస్ నేతలకు అలవాటైపోయిందని విమర్శించారు. హిందువుల పండుగలంటే అంత చులకనా? ‘బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధులివ్వదు. హిందువుల పండుగలకు పైసలివ్వరు. సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ముకాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోంది’అని బండి సంజయ్ విమర్శించారు. రంజాన్‌కు రూ.33 కోట్లు, హిందువులను చంపిన తబ్లిగీ జమాతే సంస్థకు రూ.2.40 కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్కనర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.