బిగ్ బ్యాటరీతో నుబియా కొత్త ఫోన్
జెడ్‌టీఈ బ్రాండు నుబియా బుధవారం సరికొత్త సెల్ఫీ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ నుబియా ఎన్2ను భారత్‌లో లాంచ్ చేసింది.
జెడ్‌టీఈ బ్రాండు నుబియా బుధవారం సరికొత్త సెల్ఫీ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ నుబియా ఎన్2ను భారత్‌లో లాంచ్ చేసింది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మాత్రమే కాక, భారీ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్‌ను లాంచ్ చేయడం విశేషం. ఈ బ్యాటరీ 60 గంటల టాక్ టైమ్, 3 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను కలిగి ఉండనుంది. ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ఇండియాలో నేటి అర్థరాత్రి నుంచే అందుబాటులో ఉండనుంది. షాంపైన్ గోల్డ్, బ్లాక్ గోల్డ్ రంగుల వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. దీని ధర కూడా రూ.15,999నేనని కంపెనీ తెలిపింది.
నుబియా ఎన్2 ఫీచర్ల ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం...
డ్యూయల్ సిమ్(నానో+నానో)
నుబియా యూఐ 4.0 ఆధారిత ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
5.5 అంగుళాల హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే
2.5డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే
ఆక్టాకోర్ మీడియా టెక్ ఎంటీ6750 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్
64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
128జీబీ వరకు విస్తరణ మెమరీ
13ఎంపీ రియర్ కెమెరా
16ఎంపీ ఫ్రంట్ కెమెరా
4జీ వాయిస్‌ఓవర్ ఎల్టీఈ
నాన్ రిమూవబుల్ బ్యాటరీ