మరో బౌట్‌కు విజేందర్ సిద్ధం | Vijender upbeat ahead of second professional bout in Ireland | Sakshi
Sakshi News home page

మరో బౌట్‌కు విజేందర్ సిద్ధం

Nov 7 2015 1:52 AM | Updated on Sep 3 2017 12:08 PM

మరో బౌట్‌కు విజేందర్ సిద్ధం

మరో బౌట్‌కు విజేందర్ సిద్ధం

ప్రొఫెషనల్ బాక్సర్‌గా అరంగేట్రం చేసిన తొలి బౌట్‌లోనే టెక్నికల్ నాకౌట్ విజయాన్ని సాధించిన భారత స్టార్ విజేందర్ మరో బౌట్‌కు సిద్ధమయ్యాడు.

డబ్లిన్ (ఐర్లాండ్): ప్రొఫెషనల్ బాక్సర్‌గా అరంగేట్రం చేసిన తొలి బౌట్‌లోనే టెక్నికల్ నాకౌట్ విజయాన్ని సాధించిన భారత స్టార్ విజేందర్ మరో బౌట్‌కు సిద్ధమయ్యాడు. డీన్ జిలెన్ (ఇంగ్లండ్)తో శనివారం జరిగే బౌట్‌లో విజేందర్ అమీతుమీ తేల్చుకుంటాడు. ఈ బౌట్‌లో మూడు నిమిషాల నిడివి గల నాలుగు రౌండ్‌లు ఉంటాయి. ఈ బౌట్‌ను వీక్షించేందుకు హాలీవుడ్ ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు. గత నెలలో సోనీ వైటింగ్ (ఇంగ్లండ్)తో జరిగిన తొలి బౌట్‌లో విజేందర్ మూడో రౌండ్‌లోనే విజయాన్ని దక్కించుకున్నాడు. తన ప్రమోటర్ నీరవ్ తోమర్, ట్రెయినర్ లీ బియర్డ్‌లతో కలిసి గురువారం విజేందర్ ఇక్కడకు వచ్చాడు. ‘ఈ బౌట్ కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను. నా ప్రత్యర్థి జిలెన్ సవాల్‌కు సిద్ధంగా ఉన్నాను. నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అభిమానులను అలరించేందుకు ప్రయత్నిస్తాను’ అని విజేందర్ అన్నాడు.
 

Advertisement

పోల్

Advertisement