
కలినిన్‌గ్రాడ్: ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. గత కొన్ని దశాబ్దాల నుంచే అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడగా వెలుగొందుతున్న ఫుట్‌బాల్‌పై అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రదర్శిస్తారు. అందులో వరల్డ్ కప్ అంటే ఆ అభిమానం మరింత రెట్టింపు అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ.
యూకేలోని చెల్టెన్‌హామ్‌కు చెందిన గస్ హల్లీ ఫుట్‌బాల్‌పట్ల తన మక్కువను వెరైటీగా చాటాడు. బీర్లుతో తన అభిమానాన్ని చాటుకున్నాడు. వరల్డ్‌కప్‌లో తలపడుతున్న 32 దేశాల బీర్లను సేకరించి ఫుట్‌బాల్‌పై ‘బీరా’భిమానం ప్రదర్శించాడు. ఇందుకు అతగాడికి అయిన ఖర్చు దాదాపు రూ. 45 వేలట.