ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ ఓటమి అంచున నిలిచింది.
రాయ్‌పూర్: ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ ఓటమి అంచున నిలిచింది. 232 పరుగుల లక్ష్యంతో సోమవారం నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లకు 121 పరుగులు చేసింది.
అంతకుముందు ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో హరియాణాపై జార్ఖండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు చేరింది.