కాంపౌండర్ కొడుకు.. దుమ్మురేపుతున్నాడు! | son of a compounder making wonders in cricket | Sakshi
Sakshi News home page

కాంపౌండర్ కొడుకు.. దుమ్మురేపుతున్నాడు!

Jul 28 2014 4:17 PM | Updated on Sep 2 2017 11:01 AM

కాంపౌండర్ కొడుకు.. దుమ్మురేపుతున్నాడు!

కాంపౌండర్ కొడుకు.. దుమ్మురేపుతున్నాడు!

ఓ కాంపౌండర్ కొడుకు దేశవిదేశాల్లో దుమ్ము రేపుతున్నాడు.

మధ్యప్రదేశ్లో ఓ చిన్న ఊరు.. రత్లాం. అక్కడ పుట్టిన ఓ కాంపౌండర్ కొడుకు దేశవిదేశాల్లో దుమ్ము రేపుతున్నాడు. అశుతోష్ శర్మ అనే ఆ పదహారేళ్ల కుర్రాడు ప్రస్తుతం అండర్-16 విభాగంలో భారతజట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ఆటలో మాత్రం దూసుకెళ్లిపోతున్నాడు. మధ్యప్రదేశ్ రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అశుతోష్.. త్వరలోనే టీమిండియా బ్లూ జెర్సీ వేసుకోవాలని తహతహలాడుతున్నాడు.

గత సంవత్సరం జరిగిన బంగ్లాదేశ్ పర్యటనలో అశుతోష్ తన బ్యాటింగ్తో దిగ్గజాల దృష్టిని ఆకర్షించాడు. తాను ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. తర్వాత మధ్యప్రదేశ్ తరఫున అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడి 600 పరుగులు చేశాడు. ప్రస్తుతం అశుతోష్ క్రిస్టియన్ ఎమినెంట్ స్కూల్లో సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఆటతో పాటు చదువుమీద కూడా దృష్టి పెడుతున్నానని, రోరజుకు ఆరు గంటలు చదువుతున్నానని చెప్పాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement