అంపైర్‌ను పడేసిన రాయ్‌! | Sakshi
Sakshi News home page

అంపైర్‌ను పడేసిన రాయ్‌!

Published Sat, Jun 8 2019 5:19 PM

Jason Roy took down the umpire at the bowlers end - Sakshi

కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 30 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ మాత్రమే కోల్పోయి 185 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ శతకంతో మెరిశాడు. 93 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో జేసన్‌ రాయ్‌ సెంచరీతో మెరిశాడు. కాగా, రాయ్‌ సెంచరీని పూర్తి చేసే క్రమంలో అం‍పైర్‌ను కిందపడేశాడు. ముస్తాఫిజుర్‌ వేసిన 27 ఓవర్‌ ఐదో బంతిని డీప్‌ స్వేర్‌ లెగ్‌ వైపు ఆడాడు.

అది బంగ్లా ఫీల్డర్‌ చేతుల్లోంచి మిస్‌ కావడంతో బౌండరీ లైన్‌ను తాకింది. ఈ క్రమంలోనే బంతిని చూస్తూ నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌లోకి వస్తున్న రాయ్‌.. అమాంతం అంపైర్‌ జోయల్‌ విల్సన్‌ను ను ఢీకొట్టాడు. అదే సమయంలో అంపైర్‌ కూడా బంతినే చూస్తుండటంతో అనుకోకుండా ఇద్దరు ఢీకొన్నారు. దాంతో అంపైర్‌ ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే అంపైర్‌కు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాన్ని గ్యాలరీ నుంచి చూసిన ఇంగ్లండ్‌ క్రికెటర్లు మాత్రం పడి పడి నవ్వుకున్నారు. బెయిర్‌స్టో హాఫ్‌ సెంచరీ చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement