కోహ్లి కెప్టెన్సీలో తొలిసారి..

India for the first time in Kohlis captaincy are unchanged - Sakshi

సౌతాంప్టన్‌: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో​ జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటవరకూ జరిగిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్‌ రెండు గెలవగా, భారత్‌ ఒక మ్యాచ్‌లో గెలిచింది. దాంతో విరాట్‌ సేన 1-2తో వెనుకంజలో ఉంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే యోచనతో టీమిండియా బరిలోకి దిగుతుండగా, ముందుగానే సిరీస్‌ను సాధించాలనే పట్టుదలతో ఇంగ్లండ్‌ పోరుకు సిద్దమైంది. ఇదిలా ఉంచితే తాజా టెస్టులో టీమిండియా ఎటువంటి మార్పుల్లేకుండా ఆడనుంది. ఫలితంగా విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో తొలిసారి మార్పులేకుండా మొదటిసారి టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. ఇప్పటివరకూ కోహ్లి నాయకత్వంలో భారత్‌ 38 టెస్టులు ఆడగా, ఏ ఒక్కసారి ఆడిన జట్టుతో మళ్లీ బరిలోకి దిగలేదు. అయితే ఇంగ్లండ్‌తో నాల్గో టెస్టు మ్యాచ్‌ భారత్‌కు కీలకం కావడంతో మార్పులేకుండా ఆడాలని విరాట్‌ ముందుగానే నిర్ణయించుకున్నాడు.

తుది జట్లు

భారత్‌; విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర పుజారా, అజింక్యా రహానే, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మొహ్మద్‌ షమీ, బూమ్రా

ఇంగ్లండ్‌; జో రూట్‌(కెప్టెన్‌), అలెస్టర్‌ కుక్‌, కీటన్‌ జెన్నింగ్స్‌, బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్‌, జాస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కుర్రాన్‌, ఆదిల్‌ రషిద్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్ప్‌ అండర్సన్‌

‘సమం’ కోసం సమరం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top