విరాట్‌.. యూ లిటిల్‌ బిస్కెట్‌!!

AB de Villiers Hilarious Nickname For Virat Kohli - Sakshi

ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు10 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సొంతగడ్డపై కేకేఆర్‌ను ఓడించిన కోహ్లి జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ కోహ్లి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కించుకున్నాడు. అంతేగాక ఐపీఎల్‌లో ఐదో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ నేపథ్యంలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటి ప్లే ఆఫ్‌ ఆశలను నిలిపిన కోహ్లిపై ఆర్సీబీ అభిమానులతో పాటు సహచర ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇందులో భాగంగా... అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన ఆర్సీబీ హిట్టర్‌ ఏబీ డివిలియర్స్‌ కూడా కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తాడు. ‘ విరాట్‌!!!!! యూ లిటిల్‌ బిస్కెట్‌. మెయిన్‌ అలీతో ఆటు బౌలర్లను హడలెత్తించావు. ఫస్ట్‌ ఆఫ్‌ వెరీగుడ్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన కోహ్లి, ఏబీ అభిమానులు ‘వావ్.. కోహ్లి నిక్‌నేమ్‌ బాగుంది. లిటిల్‌ బిస్కెట్‌ రాకింగ్‌ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా పరుగుల వరద పారిస్తున్న కోహ్లిని రన్‌ మెషీన్‌, చీకూ, కింగ్‌ కోహ్లి అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే.

కోహ్లి మ్యాజిక్‌తో కట్టిపడేశాడు!
ఈ‘డెన్‌’లోని ప్రేక్షకులను కోహ్లి తన మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. ముందు ఓపిగ్గా ఆడినా... తర్వాత బౌండరీలతో ఊపేసినా... చివరకు శతక్కొట్టినా... అద్భుతమైన క్యాచ్‌లు పట్టినా... ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘విరాట్‌’పర్వమే కనబడింది. అంతేకాదు... తన సరదాలహరి కూడా ఈడెన్‌ ప్రేక్షకుల్ని రంజింపజేసింది. 18వ ఓవర్‌ వేసిన నరైన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన కోహ్లి పరుగు తీసి నాన్‌ స్ట్రయిక్‌లోకి వచ్చాడు. బంతి వేసేందుకు వచ్చిన నరైన్‌ బంతిని సంధించలేదు. ‘మన్కడింగ్‌’ అనుకొని కోహ్లి క్రీజ్‌లోకి బ్యాట్‌ పెడుతూ ఫోజు ఇచ్చాడు. ఇది మైదానంలో నవ్వులు పూయించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top