గ్రహం అనుగ్రహం (25-09-16)
గ్రహం అనుగ్రహం
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం తిథి బ.దశమి తె.4.01 వరకు (తెల్లవారితే
సోమవారం), నక్షత్రం పునర్వసు రా.6.48 వరకు
వర్జ్యం ఉ.7.11 నుంచి 8.44 వరకు
తదుపరి రా.2.28 నుంచి 4.14 వరకు
దుర్ముహూర్తం సా.4.19 నుంచి 5.07 వరకు
అమృతఘడియలు సా.4.27 నుంచి 6.01 వరకు
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.57
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి.
వృషభం: మిత్రులతో కలహాలు. రుణభారాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యం.
మిథునం: పరిస్థితు లు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కర్కాటకం: శ్రమాధిక్యం. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఇంటాబయటా బాధ్యతలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మానసిక అశాంతి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
వృశ్చికం: శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
ధనుస్సు: దూరపు బంధువులతో సఖ్యత. విద్యావకాశాలు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో పదోన్నతులు.
మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు.
కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
మీనం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు అధికం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
- సింహంభట్ల సుబ్బారావు


