రోడ్లపై మైనార్టీల హిందుస్థాన్ నినాదాలు! | When Muslim men chanted `Hindustan Zindabad`, `Pakistan Murdabad` slogans on Hyderabad roads | Sakshi
Sakshi News home page

రోడ్లపై మైనార్టీల హిందుస్థాన్ నినాదాలు!

Aug 27 2016 10:34 AM | Updated on Oct 16 2018 5:58 PM

రోడ్లపై మైనార్టీల హిందుస్థాన్ నినాదాలు! - Sakshi

రోడ్లపై మైనార్టీల హిందుస్థాన్ నినాదాలు!

త్రివర్ణ పతాకంతో కొందరు ముస్లిం వ్యక్తులు మోటార్ సైకిల్ పై హైదరాబాద్ వీధుల్లో హిందుస్థాన్ జిందాబాద్ అంటూ ర్యాలీగా తిరగడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ నగర వీధుల్లో హిందుస్థాన్ నినాదాలు వినిపించడం ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. త్రివర్ణ పతాకంతో కొందరు మైనార్టీ వ్యక్తులు మోటార్ సైకిల్ పై వీధుల్లో హిందుస్థాన్ జిందాబాద్ అంటూ ర్యాలీగా తిరగడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారతీయ జెండాను చేత పట్టుకొన్న యువకులు ర్యాలీలో హిందుస్థాన్ జిందాబాద్ తో పాటు పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

యువకులు ఐఎస్ఐఎస్ ముర్దాబాద్ అంటూ కూడా నినదించడం వీడియోలో కనిపిస్తుంది. హైదరాబాద్ నియోజకవర్గం నుంచీ  లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న  ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. మెడపై కత్తి పెట్టినా  భారత్ మాతాకీ జై అనేది లేదన్న వివాదం కొనసాగిన నేపథ్యంలో.. హైదరాబాద్ నగర వీధుల్లో హిందుస్థాన్ జిందాబాద్ నినాదాలు స్థానికుల్లో ఆసక్తిని రేపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement