చెన్నైలో డీఎంకే శాంతి ర్యాలీ | DMK Takes Big Peace rally in chennai | Sakshi
Sakshi News home page

కరుణానిధి వర్ధంతి; డీఎంకే శాంతి ర్యాలీ

Aug 7 2019 4:13 PM | Updated on Aug 7 2019 4:32 PM

DMK Takes Big Peace rally in chennai - Sakshi

సాక్షి, చెన్నై: మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ప్రధమ వర్ధంతి పురస్కరించుకుని డీఎంకే పార్టీ భారీగా శాంతి ర్యాలి నిర్వహించింది. డీఎంకే ఛీప్ ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్, ఎంపి కనిమొళి, ఇతర కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురయ్యారు. అన్నాసాలైలో అన్నాదురై విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత ప్రారంభమైన శాంతిర్యాలీ మౌనంగా మెరీనాతీరం‌ వైపు కదిలింది. అనంతరం మెరీనాలోని కరుణానిధి సమాధి వద్ద ర్యాలీ ముగిసింది. ర్యాలీ ముగింపులో భాగంగా కరుణానిధి సమాధి వద్ద డీఎంకే నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement