
'ప్రత్యేక హోదా కోరే రాష్ట్రాలు చాలా ఉన్నాయ్'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు. సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ ఇవ్వని కేంద్రం.. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు అందించిన సహాయాన్ని ఏకరువు పెట్టింది. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్కు రూ. 700 కోట్లు ఇచ్చాం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో రూ. 1850 కోట్లు విడుదల చేశాం అని గణాంకాలు వెల్లడించింది.
దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని ఇది కుదరని వ్యవహారంగా కేంద్రం సమాధానం ఇచ్చింది. గతంలో జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదాను మంజూరు చేసేదని తెలిపింది.