సీక్రెట్ బాత్రూమ్ లో కోట్ల నగదు, కిలోల బంగారం | black money and gold find in home secret bathroom | Sakshi
Sakshi News home page

సీక్రెట్ బాత్రూమ్ లో కోట్ల నగదు, కిలోల బంగారం

Dec 10 2016 5:27 PM | Updated on Apr 3 2019 5:16 PM

సీక్రెట్ బాత్రూమ్ లో కోట్ల నగదు, కిలోల బంగారం - Sakshi

సీక్రెట్ బాత్రూమ్ లో కోట్ల నగదు, కిలోల బంగారం

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీగా నల్లధనం బయటపడుతుంది.

బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీగా నల్లధనం బయటపడుతుంది. తాజాగా కర్ణాటకలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో సీక్రెట్ బాత్రూమ్ లో దొరికిన బంగారం, నల్లధనం వివరాలు తెలిస్తే ఎవరైనా షాక్ తింటారు. ఓ వ్యక్తి ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా సీక్రెట్ బాత్రూమ్ లో దాచిన 32 కేజీల బంగారం శనివారం ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారుల ఆకస్మిక తనిఖీలలో లభ్యమైంది. బంగారంతో పాటుగా రూ. 5.7 కోట్ల కొత్త కరెన్సీ, మరో రూ. 90లక్షల పాత కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, తమిళనాడులో పలు ప్రాంతాల్లో నల్లకుభేరుడు శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాములు ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిరణ్‌రెడ్డికి చెందిన చెన్నై, వేలూరు జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై గత మూడు రోజులుగా జరిపిన దాడుల్లో పెద్ద 170 కోట్ల నగదు, 130 కిలోల బంగారం పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఐటీ దాడుల్లో పెద్ద మొత్తంలో నల్లధనం, బంగారంతో పట్టుబడ్డ శేఖర్ రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం తొలగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement