సీనియర్ పాపులర్ నటుడు కన్నుమూత | Veteran Punjabi film actor Mehar Mittal dead | Sakshi
Sakshi News home page

సీనియర్ పాపులర్ నటుడు కన్నుమూత

Oct 22 2016 6:49 PM | Updated on Sep 4 2017 6:00 PM

సీనియర్ పాపులర్ నటుడు కన్నుమూత

సీనియర్ పాపులర్ నటుడు కన్నుమూత

సీనియర్ పంజాబీ సినీ నటుడు మెహర్ మిట్టల్ మరణించారు.

చంఢీగఢ్: సీనియర్ పంజాబీ సినీ నటుడు మెహర్ మిట్టల్ మరణించారు. ఆయన వయసు 81 ఏళ్లు. ఈ నెల 24న ఆయన జన్మదినం. కాగా గత కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న మిట్టల్.. పుట్టినరోజుకు రెండు రోజుల ముందు శనివారం మౌంట్ అబులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

1974-98 మధ్య కాలంలో మిట్టల్ వందకుపైగా సినిమాల్లో నటించారు. హాస్య పాత్రలతో బాగా పాపులర్ అయ్యారు. ఆయన ఫుల్టైమ్ నటుడిగా మారకముందు కొంతకాలం టీచర్గా, మరికొంతకాలం లా ప్రాక్టీస్ చేశారు. మిట్టల్ మృతికి పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ సంతాపం ప్రకటించారు. పంజాబ్ సినీ పరిశ్రమకు ఆయన ఎంతో సేవచేశారని, ఆయన మృతి తీరనిలోటని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement