టోటల్‌గా నైన్ : హన్సిక
తెలుగులో పరిచయమై... తమిళంలో బిజీ అయిపోయి.. మళ్లీ తెలుగుతెరపై హవా సాగించిన కథానాయిక ఎవరు? అనంటే... టక్కున వచ్చే సమాధానం తమన్నా. అయితే... త్వరలో తమన్నా పక్కన హన్సిక కూడా చేరనుంది.
తెలుగులో పరిచయమై... తమిళంలో బిజీ అయిపోయి.. మళ్లీ తెలుగుతెరపై హవా సాగించిన కథానాయిక ఎవరు? అనంటే... టక్కున వచ్చే సమాధానం తమన్నా. అయితే... త్వరలో తమన్నా పక్కన హన్సిక కూడా చేరనుంది. తమిళంలో ఇప్పటికే ‘సూపర్‌స్టార్’ అనిపించుకున్న ఈ బొద్దుగుమ్మ, ఇప్పుడు నిదానంగా తెలుగు సినిమాల్లో బిజీ అయిపోతున్నారు.
ప్రస్తుతం విష్ణు సరసన ఓ చిత్రం, నాగచైతన్య సరసన మరో చిత్రంలో నటిస్తున్న హన్సిక... నితిన్, కరుణాకరన్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో కూడా కథానాయికగా నటించనుంది. అయితే... స్టార్ హీరోలు మాత్రం ఈ ముద్దుగుమ్మ విషయంలో శీతకన్ను వేస్తున్నారని సమాచారం. ఈ విషయాన్నే హన్సిక ముందు ప్రస్తావిస్తే -‘‘మీరు చెప్పేదాకా ఈ విషయం నాకూ తెలీదు.
అయినా అవకాశాలకోసం వెంపర్లాడటం నాకు మొదట్నుంచీ లేదు. వచ్చిన ప్రతి సినిమానీ నేను చేయను. నచ్చిన సినిమానే చేస్తాను. నా పాత్ర బాగుంటే హీరోలు, నిర్మాణ సంస్థ, పారి తోషికం... అనే అంశాల గురించి అస్సలు ఆలోచించను. అసలు ఇలాంటి వ్యాఖ్యల గురించి ఆలోచించే తీరిక నాకు లేదు. తమిళంలో ఆరు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో మూడు. టోటల్‌గా నైన్. ఇక ఖాళీ ఎక్కడిది’’ అన్నారు.