‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌ | Saaho Producers Thanking Note To Producers | Sakshi
Sakshi News home page

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

Aug 6 2019 11:43 AM | Updated on Aug 6 2019 11:43 AM

Saaho Producers Thanking Note To Producers - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాకు రిలీజ్‌ డేట్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

అన్ని భాషల్లో ఒకే డేట్‌లో రిలీజ్ చేయాలంటే ఇతర చిత్రాలతో పోటి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అన్ని భాషల్లోనూ నిర్మాతలు సాహో రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ చేశారు. ఆగస్టు 30న రిలీజ్ కావాల్సిన తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఈ విషయంపై సాహో నిర్మాతలు స్పందించారు. సాహో భారీ రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ చేసినందుకు అన్ని భాషల నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.

ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, అరుణ్‌ విజయ్‌లు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement