దేవుడిని మరో వరం కోరిన రాంగోపాల్‌ వర్మ | Oh God.. Send Sridevi Back Again : Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

దేవుడా.. శ్రీదేవిని వెనక్కు పంపించవా..: వర్మ

Mar 1 2018 7:06 PM | Updated on Apr 3 2019 6:34 PM

Oh God.. Send Sridevi Back Again : Ram Gopal Varma - Sakshi

సాక్షి, ముంబయి : ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణంపై మీడియా వార్త కథనాలు కాస్త తగ్గుముఖంపట్టాయి. ఆమె మరణంపై చర్చించుకోవడం కాస్తంత తగ్గింది. కానీ, ఒక వ్యక్తి మాత్రం ఇంకా ఆ బాధలో నుంచి బయటకు రాలేదు. అంతకు మించిన రెట్టింపు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. శ్రీదేవి అంటే పిచ్చి అభిమానం, పిచ్చి ప్రేమ, ఆమెను చూసే డైరెక్టర్‌గా మారాను అంటూ బాహాటంగా చెప్పుకునే రాంగోపాల్‌ వర్మ ప్రతిక్షణం తన బాధను వ్యక్తం చేస్తూ శ్రీదేవి మృతిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

హోలీ పర్వదినాన రెండు ట్వీట్‌లు ఆయన చేశారు. తొలి ట్వీట్‌లో శ్రీదేవి అంతిమ యాత్ర సమయంలో హాజరైన అశేష అభిమానులతో కిక్కిరిసి ఉన్నప్పటి చిత్రాన్ని పెట్టి.. సముద్రమంత ప్రేమను కురిపిస్తున్న అభిమానులకోసమైనా దేవుడు తన మనసును మార్చుకొని శ్రీదేవిని వెనక్కు పంపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక హోలీకి సంబంధించిన ట్వీట్‌ చేసి ఈ హోలీ తనకు సంతోషకరమైనది కాదని, అందరికీ 'అన్ హ్యాపీ హోలీ' అని పేర్కొన్నారు. దేవుడు శ్రీదేవిని తీసుకెళ్లిపోయిన తీరును తాను తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్న ఆయన ఈ హోలీని ఎలా జరుపుకోగలను అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement