బర్త్‌డే స్పెషల్‌

mahesh babu new movie first look august 9 release - Sakshi

కొత్త సినిమా కోసం గడ్డం, మీసం పెంచి డిఫరెంట్‌ గెటప్‌లోకి దిగిపోయారు మహేశ్‌బాబు. ఈ నయా లుక్‌కి చెందిన ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అధికారికంగా మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ డెహ్రాడూన్‌లో పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ అండ్‌ టైటిల్‌ను మహేశ్‌బాబు బర్త్‌డే స్పెషల్‌గా ఈ ఏడాది ఆగస్టు 9న రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందట. గతంలో తెరపైకి వచ్చిన కొన్ని టైటిల్స్‌ను దర్శకుడు వంశీ కాదని చెప్పేశారు. దీంతో ఈ సినిమాకు ఏ టైటిల్‌ పెడతారా? అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో మొదలైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top