శృంగారం గురించి బాలీవుడ్‌ నటి సంచలన వ్యాఖ్యలు

Kangana Ranaut Talks About Personal Life - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే మైండ్ రాక్స్ సదస్సులో ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. తన ఫస్ట్ క్రష్ గురించి.. తన ఫస్ట్ రిలేషన్‌షిప్ గురించి కూడా ఆమె వివరించారు. శృంగారం పట్ల మన దేశంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రస్తావించిన ఆమె.. శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన అంశమని అన్నారు.

‘మీకు శృంగారం కావాల్సినప్పుడు దాన్ని ఆస్వాదించండి.. అంతేకానీ దానిని అతిగా కాంక్షించడం ఎందుకు? ఒకప్పుడు కేవలం శృంగారం కోసమే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనికి కట్టుబడి ఉండాలని చెప్పేవారు. చరిత్రలో చోటుచేసుకున్న దండయాత్రల కారణంగా ఇప్పటికీ మన ఆలోచనలు అక్కడే ఉన్నాయి. మన పవిత్ర గ్రంథాలు కూడా శృంగారాన్ని అనుమతించవు. కానీ పిల్లలు శృంగారంలో పాల్గొనడంపట్ల తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి. పిల్లలు కూడా శృంగారం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నేను శృంగారపరంగా యాక్టివ్‌గా ఉన్నానని తెలుసుకొని నా తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. పిల్లలు శృంగారంలో పాల్గొనేలా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి’ అని ఆమె చెప్పుకొచ్చారు. కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించిన గత చిత్రం ‘మణికర్ణిక’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ సినిమాలో నటిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తలైవి అనే టైటిల్ అనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top