కాజల్‌ వద్దనుకుందా? | Kajal Aggarwal Decision Change on Producing Movies | Sakshi
Sakshi News home page

కాజల్‌ వద్దనుకుందా?

Aug 2 2019 7:35 AM | Updated on Aug 8 2019 11:13 AM

Kajal Aggarwal Decision Change on Producing Movies - Sakshi

సినిమా: నటి కాజల్‌ అగర్వాల్‌ వద్దనుకుందా? ఇందుకు అవుననే బదులే సినీ వర్గాల నుంచి వస్తోంది. దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్లలో ఒకరుగా రాణిస్తున్న నటి కాజల్‌అగర్వాల్‌. హిందీలోనూ అడపాదడపా అవకాశాలను రాబట్టుకుంటున్న ఈ బ్యూటీకి ఇటీవల హిట్‌ దోబూచులాడుతోంది. తెలుగులో హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రం సీతపై చాలా ఆశలు పెట్టుకున్నా, ఆది చాలా నిరాశనే మిగిల్చింది. ఇక హిందీ సూపర్‌హిట్‌ చిత్రం క్వీన్‌ తమిళ రీమేక్‌లో నటించింది. ఇదీ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రమే. అయితే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెరపైకి రావడానికి ఇంకా విముక్తి కలగలేదు. అయినా కాజల్‌అగర్వాల్‌ యమ ఖుషీగానే ఉంది. కారణం చాలా గ్యాప్‌ తరువాత కోలీవుడ్‌లో అది లక్కీ హీరో జయంరవికి జంటగా నటించిన కోమాలి చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుండడం ఒక కారణం కాగా ఇక మొదలవుతుందో, లేదోననుకున్న కమలహాసన్‌తో నటించే ఇండియన్‌–2 చిత్రం తెరకెక్కడానికి సిద్ధం అవడం రెండో కారణం.

దీంతో నటిగా తన కెరీర్‌ను మరి కొన్నేళ్లు లాగించేయవచ్చుననే నమ్మకం కుదిరినట్లుంది. ఈ అమ్మడి ఆనందానికి ఇదో కారణం కావచ్చు. ఇకపోతే కాజల్‌అగర్వాల్‌ తన క్రేజ్‌ను వాణిజ్యపరంగానూ ఎడాపెడా వాడేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నా, చాలదన్నట్లు నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చిందని ఆ మధ్య ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు నటి తమన్నాతో కలిసి దాన్ని ఆచరణలో పెట్టేసినట్లు, అందుకుగానూ ఆరంభ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిసింది. విషయం ఏమిటంటే ఎప్పుడూ నోట్లు తీసుకునే అలవాటే ఉన్న కాజల్‌కు సినీ నిర్మాణం చేపట్టగానే దాచిన డబ్బును బయటకు తీయాల్సిన పరిస్థితి. చిత్ర నిర్మాణం అంటే మాటలా డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అవుతుండడంతో  నటి తమన్నా చిత్ర నిర్మాణం నుంచి ఎస్కేప్‌ అయ్యింది. దీంతో కాజల్‌అగర్వాల్‌  కుటుంబ సభ్యులకు చిత్ర నిర్మాణం ఇష్టంలేకపోవడంతో సినిమా లేదు గినిమా లేదు. కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టి సినిమా చేయడం కంటే నటిగా వచ్చిన చిత్రాలను నటిస్తే చాలు అని కాజల్‌ అగర్వాల్‌కు హితవు పలికారని సమాచారం. దీంతో నిర్మాతగా మారాలన్న తన ఆశను ఈ అమ్మడు డ్రాప్‌ చేసుకుందన్నది తాజా సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని నిర్మించి విడుదల చేయడం అంత సులభం కాదనే విషయాన్ని కాజల్‌ గ్రహించిందట. అలా నిర్మాతగా కాజల్‌ డ్రాప్‌ అయినట్లు తాజా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement