వారు నా కోరిక తీరుస్తారనుకుంటా! | I am acting only action-oriented story says Kajal Agarwal | Sakshi
Sakshi News home page

వారు నా కోరిక తీరుస్తారనుకుంటా!

Oct 23 2016 3:00 AM | Updated on Apr 3 2019 8:51 PM

వారు నా కోరిక తీరుస్తారనుకుంటా! - Sakshi

వారు నా కోరిక తీరుస్తారనుకుంటా!

కొన్ని విషయాల్లో నాకు నేను సర్దిచెప్పుకోవలసి వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.

  కొన్ని విషయాల్లో నాకు నేను సర్దిచెప్పుకోవలసి వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. తమిళం, తెలుగు భాషల్లో దాదాపు ప్రముఖ కథానాయకులందరితోనూ నటించి టాప్ కథానాయకిగా రాణిస్తున్న నటి ఈ ఉత్తరాది భామ. తొలి రోజుల్లో కేరీర్ పరంగా కాస్త తడబడినా, ఆ తరువాత నిలదొక్కుకున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో విజయం కోసం చాలా దూరం పరిగెత్తాల్సి వచ్చింది. ఎంతో నిరీక్షణ తరువాతే కార్తీకు జంటగా నటించిన నాన్ మహాన్ అల్ల చిత్రం కాజల్‌కు కాస్త విజయం రుచిని చూపించింది.
 
 ఆ తరువాత విజయ్‌తో రొమాన్స్ చేసిన తుపాకీ, జిల్లా చిత్రాల విజయాలు ఈ అమ్మడికి  స్టార్ నాయకి అంతస్తును అందించాయి. ఆ తరువాత సూర్యతో మాట్రాన్, ధనుష్‌కు జంటగా మారి అంటూ ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. ప్రస్తుతం తమిళంలో జీవాతో డ్యూయెట్లు పాడిన కవలైవేండామ్ చిత్ర విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా అజిత్‌తో కలిసి నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులో యువ స్టార్స్ అందరితోనూ జత కట్టిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఆయన 150వ చిత్రంలో నటించే లక్కీచాన్స్‌ను కొట్టేశారు.
 
  ఇలా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోలతో నటించడంతో సీనియర్ నటి అని అనడంతో తన బాధ్యత మరింత పెరిగిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్ పేర్కొన్నారు. ఆ భేటీలో తెలుపుతూ నటిగా పదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. వరుసగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నటించడం వల్ల కొన్ని విషయాల్లో నాకు నేనే సర్దిచెప్పుకోవలసి వచ్చింది. అయితే ఇకపై చెత్త చిత్రాలను అంగీకరించరాదన్న నిర్ణయానికి వచ్చాను.
 
  బలమైన పాత్రలు, స్త్రీ ప్రాధాన్యత గలిగిన చిత్రాలనే అంగీకరించాలనుకుంటున్నాను. ముఖ్యంగా యాక్షన్ ఓరియెంటెడ్ కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను. దర్శక నిర్మాతలు నా కోరికను నెరవేరుస్తారని నమ్ముతున్నాను అని కాజల్ తన మనసు విప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement