ఈ కథకు లిప్‌లాక్ కీలకం... | Sakshi
Sakshi News home page

ఈ కథకు లిప్‌లాక్ కీలకం...

Published Wed, Aug 6 2014 11:07 PM

ఈ కథకు లిప్‌లాక్ కీలకం...

‘సమాజాన్ని ప్రతిబింబించేలా ఇందులో పాత్రలు ఉంటాయి. మా అందరికీ బ్రేక్ రావాలనే ఆశయంతో తీసిన సినిమా కాదు. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే తపనతో చేశాం. ఈ చిత్రంలో ఓ లిప్ లాక్ సీన్ ఉంది. సెన్సార్ బోర్డ్‌వారు అది తీసేయమన్నారు. కానీ, కథకు కీలకం కాబట్టి, తీయలేదు. అందుకే ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు’’ అని దర్శకుడు సంపత్ నంది చెప్పారు. ఆయన నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటితో కలిసి నిర్మించిన చిత్రం ‘గాలిపటం’. ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా ముఖ్య తారలుగా నవీన్ గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం నా కెరీర్‌కి చాలా ముఖ్యం. ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా చాలా సంతోషాన్నిచ్చింది. యవతరానికి బాగా కనెక్ట్ అయ్యే చిత్రం. డైలాగులు బాగున్నాయి. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం క్లయిమాక్స్, ప్రధమార్ధం’’ అని చెప్పారు. ఇందులో మంచి పాత్ర చేశానని ఎరికా అన్నారు. ‘‘రేసు గుర్రం, దృశ్యం.. ఇలా ఈ మధ్యకాలంలో చివర్లో సున్నా ఉన్న టైటిల్‌తో రూపొందిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించాయని, ‘గాలిపటం’ హిట్ ఖాయమని అందరూ అంటున్నారు’’ అని కిరణ్ చెప్పారు.

Advertisement
Advertisement