కేకు ముక్క ఖరీదు.. రూ. 1.33 లక్షలు! | Slice of Queen Victoria's wedding cake sold for 1,500 pounds | Sakshi
Sakshi News home page

కేకు ముక్క ఖరీదు.. రూ. 1.33 లక్షలు!

Sep 15 2016 7:26 PM | Updated on Sep 4 2017 1:37 PM

కేకు ముక్క ఖరీదు.. రూ. 1.33 లక్షలు!

కేకు ముక్క ఖరీదు.. రూ. 1.33 లక్షలు!

విక్టోరియా మహారాణి పెళ్లినాటి కేకు ముక్కను వేలం వేస్తే.. ఏకంగా రూ. 1.33 లక్షలు పలికింది.

విక్టోరియా మహారాణి పెళ్లినాటి కేకు ముక్కను వేలం వేస్తే.. ఏకంగా రూ. 1.33 లక్షలు పలికింది. అది 19వ శతాబ్దం నాటి కేకు ముక్క కావడం, అది కూడా రాణీగారి పెళ్లి కేకు కావడంతో ఈ స్థాయిలో ధర వచ్చింది. యువరాజు ఆల్బర్ట్‌తో విక్టోరియా మహారాణి పెళ్లి 1840లో జరిగింది. దీన్ని డేవిడ్ గైన్స్‌బరో రాబర్ట్స్ వేలానికి పెట్టారు. దాన్ని ప్యాక్ చేసిన ప్రజంటేషన్ బాక్సుమీద ''రాణీగారి పెళ్లి కేకు బకింగ్‌హామ్ ప్యాలెస్, ఫిబ్రవరి 10, 1840'' అని చెక్కి ఉంది. రాజముద్ర ఉన్న కాగితం మీద విక్టోరియా మహారాణి సంతకం కూడా ఆ కేకుతో పాటు ఉంచారు.

లండన్‌లోని క్రిస్టీస్‌ వేలం శాలలో మోనార్క్ నిక్కర్లు, టైటానిక్ తాళాలు, విన్‌స్టన్ చర్చిల్ టోపీ కూడా వేలానికి వేశారని బీబీసీ తెలిపింది. అండర్‌వేర్‌కు రూ. 14.42 లక్షల రేటు పలికింది. నిజానికి దీనికి మహా అయితే 88 వేల నుంచి 1.6 లక్షల వరకు మాత్రమే వస్తుందని అంచనా వేశారు. జీవితాంతం అరుదైన వస్తువులను సేకరిస్తూ వచ్చిన రాబర్ట్స్ (70).. ఇప్పుడు వాటిని వేలం వేసి లక్షలకు లక్షలు ఆర్జిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement