హెచ్‌సీయూ విద్యార్థినికి ‘రైటర్స్’ అవార్డు | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ విద్యార్థినికి ‘రైటర్స్’ అవార్డు

Published Sat, Feb 28 2015 4:28 AM

హెచ్‌సీయూ విద్యార్థినికి ‘రైటర్స్’ అవార్డు

హైదరాబాద్: జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ రైటర్స్ అవార్డుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన పరిశోధక విద్యార్థిని వరం శ్రీదేవి ఎంపికయ్యారు. ఈ పరిశోధక అవార్డుకు ఎంపికైన మొదటి భారతీయ పరిశోధక విద్యార్థిని శ్రీదేవి కావడం విశేషం. యూ.కే.కు చెందిన జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ ఫౌండేషన్ ఏటా ఈ అవార్డును ప్రకటిస్తుంది.

హెచ్‌సీయూలోని స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్ కోటేశ్వరరావు వి.రాజులపాటి పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేసిన శ్రీదేవి ’స్ట్రైన్ రేట్ సెన్సిటివిటీ అంశంపై పంపించిన పరిశోధన పత్రం ‘’ఫిలాసాఫికల్ మేగజైన్ లెటర్స్’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైంది. 2012లో ఐఐటీ మద్రాస్‌లో జరిగిన సదస్సులో సమర్పించిన పరిశోధక పత్రానికి బెస్ట్ పేపర్ అవార్డును సైతం ఆమె అందుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement