వర్గీకరణ చేస్తే వెంకయ్యే మా దేవుడు : మందకృష్ణ | venkaiah naidu is our god says by manda krishna | Sakshi
Sakshi News home page

వర్గీకరణ చేస్తే వెంకయ్యే మా దేవుడు : మందకృష్ణ

Aug 10 2016 2:52 PM | Updated on Oct 8 2018 3:00 PM

వర్గీకరణ చేస్తే వెంకయ్యే మా దేవుడు : మందకృష్ణ - Sakshi

వర్గీకరణ చేస్తే వెంకయ్యే మా దేవుడు : మందకృష్ణ

ఎస్సీ వర్గీకరణ చేస్తే వెంకయ్యనాయుడే మా దేవుడు అవుతారని మందకృష్ణ మాదిగ అన్నారు.

ఢిల్లీ : ఎస్సీ వర్గీకరణ చేస్తే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే మా దేవుడు అవుతారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...తొలి నుంచి ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి రాజకీయ మద్దతు కూడగట్టింది వెంకయ్యేనన్నారు.

ఈ ధర్నా కార్యక్రమంలో బుధవారం వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎస్సీలు వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తే నష్టం లేదని చెప్పారు. అలా రిజర్వేషన్లు కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమనన్నారు. వర్గీకరణ భారం మీదేనని వెంకయ్యకు మందకృష్ణ పాదాభివందనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement