బుధవారం మధ్యాహ్నం మరోసారి నగరంలో వర్షం మొదలైంది.
ఇప్పటికే వర్షం దెబ్బకు నగరవాసులు బెంబేలెత్తిపోతుంటే వరణుడు మాత్రం నగర వాసులను వదిలిపెట్టేలాలేడు. బుధవారం మధ్యాహ్నం మరోసారి నగరంలో వర్షం మొదలైంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికే సగటు జీవుడు జీవనం అతలాకుతలం కాగా.. ఇప్పుడు మరోసారి వర్షం ప్రారంభం కావడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, అమీర్‌పేట్ , సరూర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట, పంజాగుట్ట, శేరిలింగంపల్లి, ఎస్.ఆర్ నగర్, షాపూర్, మూసాపేట, అల్విన్‌కాలనీల్లో మరోసారి వర్షం కురుస్తుండటంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు.