ట్రైగ్లిజరైడ్స్‌తో జాగ్రత్త

Cholesterol Is Made From The Fats And Sugar We Consume - Sakshi

మనం ఇటీవల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ వంటి వాటి గురించి తరచూ వింటూ ఉంటాం. అవెంతో హాని చేస్తాయన్న విషయం మనలో చాలామందికి తెలిసిందే. అసలు ట్రైగ్లిజరైడ్స్‌ అంటే ఏమిటి, అవి ఎందుకు హాని కలిగిస్తాయన్న విషయాలను తెలుసుకుందాం.

ట్రైగ్లిజరైడ్స్‌ అనేవి వున శరీరంలోనూ, ఆహారపదార్థాల్లోనూ ఉండే ఒక రకం కొవ్వు వంటి జీవరసాయన పదార్థాలు. అవి కొలెస్ట్రాల్‌ లాగానే రక్తంలో ప్రవహిస్తుంటాయి.  మనం తీసుకునే కొవ్వులు, చక్కెరల నుంచి తయారవతుంటాయి. మనం తీసుకున్న ఆహారం వెంటనే శక్తిగా వూరకపోతే అది ట్రైగ్లిజరైడ్స్‌గా వూరి కొవ్వు కణాల్లో నిల్వ అవుతుంది.

రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా ఉంటే...
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా ఉన్న కండిషన్‌ను ‘హైపర్‌ ట్రైగ్లిజరైడెమియా’ అని అంటారు. రక్తంలో వీటి పాళ్లు పెరిగితే అది గుండెజబ్బులకు దారితీయవచ్చు.

ఎక్కువగా ఉండటానికి కారణాలు...
1) డయాబెటిస్, 2) థైరాయిడ్‌ సమస్యలు, 3) చాలా ఎక్కువ మోతాదుల్లో ఆల్కహాల్‌ తీసుకోవడం. రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు రోగిని పై అంశాల విషయంలోనూ పరీక్షించాలి.

మోతాదులను తెలుసుకోవడమిలా...
ద నేషనల్‌ కొలెస్ట్రాల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ వూర్గదర్శకాల ప్రకారం పరగడపున చేసిన రక్తపరీక్షలో కనుగొనే ట్రైగ్లిజరైడ్‌ మోతాదులను కింది విధంగా వర్గీకరించారు.
150 ఎంజీ/డీఎల్‌ కంటే తక్కువగా ఉంటే... అది నార్మల్‌.  
150 – 199 ఎంజీ/డీఎల్‌ ఉంటే కొంతవరకు పరవాలేదు (బార్డర్‌లైన్‌).
200 – 499 ఎంజీ/డీఎల్‌  ఉంటే... ఎక్కువ.  
500 ఎంజీ/డీఎల్‌ అంతకు మించి ఉంటే... చాలా ఎక్కువ

పాటించాల్సిన ఆహార నియవూలు...
►హైపర్‌ ట్రైగ్లిజరైడెమియా ఉన్నప్పుడు జీవన సరళిలో వూర్పులు తెచ్చుకొని ఆహార నియమాలు పాటించాలి.

►ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా బరువు ఉంటే శరీర బరువు సాధారణస్థాయికి వచ్చేలా ఆహారంలో క్యాలరీలు తగ్గించుకోవాలి. అంటే.. కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఆల్కహాల్‌... ఇలా అన్ని పదార్థాల నుంచి మీ శరీరంలోకి వచ్చే క్యాలరీలను తగ్గించుకోవాలి.

►ఆహారంలో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ను బాగా తగ్గించాలి. అంటే... నెయ్యి, వెన్న, వనస్పతి, వూంసాహారాలైన రొయ్యలు, వూంసం, చికెన్‌ స్కిన్‌, డీప్‌గా వేయించిన వేపుళ్లను తగ్గించాలి.
     ఆల్కహాల్‌ పూర్తిగా వూనేయాలి.

►తాజాపళ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌లో పీచు ఎక్కువగా ఉండి... ట్రైగ్లిజరైడ్స్‌ పాళ్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.  వెజిటబుల్‌ సలాడ్స్, తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి.

►స్వీట్స్, బేకరీ ఐటమ్స్‌ లాంటి రిఫైన్‌డ్‌ ఫుడ్స్‌ తగ్గించాలి. పొట్టుతీయని తృణధాన్యాలు అంటే... దంపుడుబియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్‌, పొట్టుతీయని పప్పుధాన్యాలు, మెులకెత్తిన గింజలు (స్ప్రౌట్స్‌) తీసుకోవాలి.

►ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు  శారీరక శ్రవు / వాకింగ్‌ వంటి వ్యాయావూలు చేయాలి. మీ ఎత్తుకు తగిన బరువ# ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

►కనీసం వారంలో వుూడుసార్లు చేపలు... అవి కూడా కేవలం ఉడికించిన గ్రిల్డ్‌ ఫిష్‌ వూత్రమే తీసుకోవాలి.

►పొగతాగడం పూర్తిగా వూనేయాలి. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్‌ పాళ్లు పెరిగినప్పుడు డాక్టర్లు చెప్పిన వుందులు వాడుతున్నా ఆహార నియవూలు పాటించడం తప్పనిసరి. మీ ఫిజీషియన్‌/కార్డియాలజిస్ట్‌ / న్యూట్రిషనిస్ట్‌ చెప్పే సూచనలు తప్పక పాటించండి.
డాక్టర్‌ డి. మీరాజీ రావు,
సీనియర్‌  ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ కాంటినెంటల్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top