అధికారి ఇంట్లో 'పాడు' యూనిట్లు!! | padu units found in officer house instead of office | Sakshi
Sakshi News home page

అధికారి ఇంట్లో 'పాడు' యూనిట్లు!!

May 15 2014 7:56 AM | Updated on Jul 11 2019 8:26 PM

అధికారి ఇంట్లో 'పాడు' యూనిట్లు!! - Sakshi

అధికారి ఇంట్లో 'పాడు' యూనిట్లు!!

ప్రకాశం జిల్లాలో ఓ అధికారి ఏకంగా ఈవీఎం ప్రింటర్ యూనిట్లను తన ఇంట్లో పెట్టుకున్నారు. ఈ సంఘటన ఒంగోలు గానుగుపాలెం ప్రాంతంలో వెలుగు చూసింది.

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఎంత అద్భుతంగా ఏర్పాట్లు చేశారో ఇట్టే తేలిపోతోంది. ప్రకాశం జిల్లాలో ఓ అధికారి ఏకంగా ఈవీఎం ప్రింటర్ యూనిట్లను తన బంధువుల ఇంట్లో పెట్టుకున్నారు. ఈ సంఘటన ఒంగోలు గానుగుపాలెం ప్రాంతంలో వెలుగు చూసింది. మొత్తం 30 ఈవీఎం ప్రింటర్ కమ్ ఆగ్జిలరీ యూనిట్లు (పాడు) ఓ అధికారి ఇంట్లో ఉన్నాయి. ఒంగోలు గంటాయిపాలెం ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈవీఎంలు ఉన్నాయని తెలిసి స్థానికులు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు తనిఖీ చేయగా, ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 'పాడు' యూనిట్లు బయటపడ్డాయి. వాటిని వెంటనే ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. ముళ్లమూరు తహసిల్దార్ షరీఫ్.. వీటిని తన బంధువుల ఇంట్లో ఉంచినట్లు తెలిసింది.

స్ట్రాంగ్ రూంలలో గానీ, భద్రంగా కార్యాలయంలో గానీ ఉండాల్సిన ఈ 'పాడు' యూనిట్లు అధికారి బంధువుల ఇంట్లో ఉన్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంచాల్సిన ఈవీఎం ప్రింటర్ యూనిట్లను ఇంట్లో దాచి పెట్టుకోవడంతో అవెలా ఉన్నాయో అనే అనుమానాలు తలెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement